దారుణం: 15రోజుల పసికందును కొట్టిచంపిన తండ్రి
వడోదర: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడ పిల్ల పుట్టిందని ఆగ్రహానికి గురైన ఓ కిరాతక తండ్రి తన 15 రోజుల కన్న కూతురును కొట్టి చంపాడు. పల్సాన తాలూకాలోని చల్తాన్ గ్రామంలో రాజు యు థాక్రే అనే వ్యక్తి తన భార్య మీనా బెన్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన కూతురును తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది.
మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త మగ పిల్లాడినే కానాలని తరచూ గొడవపడేవాడని, ఆడ పిల్ల పుట్టిన తర్వాత అతను తనతో రోజూ గొడవపడ్డాడని తెలిపింది. ఆదివారం రాత్రి తనతో గొడవ పడి చిన్నారిన తీవ్రంగా కొట్టాడని, అడ్డువచ్చిన తన తలపై గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని నిందితుడు భార్య పోలీసులకు తెలిపింది.

ఆ తర్వాత నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడని నిందితుడి భార్య చెప్పింది. అతని కోసం ఎంత గాలించిన దొరకలేదని తెలిపింది. ఇంట్లోకి వచ్చి చూడగా తన కూతురు చనిపోయి ఉందని పోలీసులకు తెలిపింది. తన భర్తపై ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. మహారాష్ట్రకు చెందిన ఈ దంపతులు ఉపాధి కోసం గుజరాత్ రాష్ట్రం వచ్చి స్థిరపడ్డారు.
మరో ఘటనలో సూరత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవర్ పిల్లర్ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. సూరత్‌లోని పర్లి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications