వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలం వెర్రి: ఫ్యాన్సీ నంబర్ కోసం 15.4 లక్షలు.. అదీ కూడా టూ వీలర్‌కే.. ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

అవును వేలం వెర్రిలా మారింది కొందరికీ.. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకటో, తొమ్మిది నంబర్లకు ఆ క్రేజ్ కంపల్సరీ.. న్యూమరాలజీ ప్రకారం కొందరు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఎంతయినా వెచ్చిస్తున్నారు. అలా చంఢీగడ్‌లో ఒకరు రికార్డు స్థాయిలో వేలం పాడి దక్కించుకున్నారు. అదీ కూడా టూ వీలర్ కావడం గమనార్హం.

71 వేల యాక్టివాకు..

71 వేల యాక్టివాకు..

చంఢీగడ్ ఆర్టీఏ అధికారులు వాహనాల ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేశారు. రూ.71 వేలకు కొనుగోలు చేసి హోండా యాక్టివా కోసం రికార్డు ధర వెచ్చించారు. CH-01 CJ 0001 ఫ్యాన్సీ నంబరు కోసం బ్రిజ్ మోహన్ వేలం పాడారు. రూ.15.44 లక్షలు వేలంలో పాడి దక్కించుకున్నారు. ఈ నంబరుకు పెట్టిన ఖర్చుతో 21 యాక్టివాలు కొనుగోలు చేసే వీలుంది. ఖరీదైన కార్ల యజమానులు పోటీ పడినా బ్రిజ్ మోహన్ ఎక్కడా తగ్గలేదు. తనకు కావాల్సిన నంబర్ కోసం లక్షలు ఖర్చు చేశాడు. ఇక CH-01 CJ 0002 నంబరును మరో వ్యక్తి రూ.5.41 లక్షలకు దక్కించుకున్నాడు.

 ఫ్యాన్సీ నంబర్..

ఫ్యాన్సీ నంబర్..


వాస్తవానికి ఫ్యాన్సీ నంబర్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దానిని ప్రభుత్వాలు క్యాష్ చేసుకుంటాయి. 0001 నంబర్ కోసం వేలం వేయాలని.. దాంతో వచ్చే నగదును సొమ్ము చేసుకోవాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అధికారులను ఆదేశించారు. ఇంకేముంది వారు వేలం వేశారు. అందులో బ్రిజ్ మోహన్ పాల్గొన్నారు.

రూ.1.5 కోట్లు

రూ.1.5 కోట్లు

అలా చండీగడ్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ 378 వాహనాలకు వేలం వేసింది. అలా 1.5 కోట్ల నగదను సంపాదించింది. అందులో CH01-CJ0001 కోసం రూ.5 లక్షలు ప్రారంభ ధరగా నిర్ణయించారు. అదీ 15.44 లక్షల వరకు వేలం పాడింది. కానీ ఆ నంబర్ తనను యాక్టివాకు వాడనని చెప్పారు. ఈ దీపావళి రోజున కొత్త వెహికిల్ కొనుగోలు చేస్తానని చెప్పారు. అప్పటివరకు మాత్రం యాక్టివాకు తన నెంబర్ ప్లేట్ ఉంటుందని తెలిపారు. తర్వాత అదీ తన కొత్త కారుకు వెళుతుందని చెప్పారు.

 179 వాహనాలు

179 వాహనాలు


ప్రస్తుతం రాష్ట్రంలో 179 వాహనాలు 0001 పేరుతో ఉన్నాయి. ఇందులో 4 సీఎం ఖట్టర్ పేరుతో ఉండగా.. వాటిని ఇతరులకు కూడా కేటాయించాలని అనుకున్నారు. 179 వాహనాలతో రూ. 18 కోట్ల ఆదాయం సమకూరినట్టు సమాచారం. ఇటు 2012లో చంఢీగడ్‌లో మెర్సిడెస్ బెంజ్-S Class కారు యజమాని 0001 అనే నంబరుకు రికార్డు స్థాయిలో రూ.26.05 లక్షలు ఖర్చు చేశాడు. ఇప్పుడు బ్రిజ్ మోహన్ నిలిచాడు.

English summary
Chandigarh Registering and Licensing Authority had put 378 registration numbers on auction and generated Rs 1.5 crore in total as additional revenue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X