ప్రాణాన్ని బలి తీసుకున్న " కోడిగుడ్డు ".. ఏమైందంటే ?
ధనవంతుడైనా, పేదవాడైనా, రాజైన, బానిస అయినా.. ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోని అతిథి ఒకరు ఉన్నారు. ఎవరైనాయి సరే చివరికి చేరుకోవాల్సిన గమ్యస్థానం అంటే "మరణం" అనే చెప్పాలి. కానీ అది ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు. ఒక క్షణం క్రితం నవ్వుతూ మాట్లాడుతున్న మనిషి.. మరో క్షణంలో మృతదేహంగా మారిపోవచ్చు. రోడ్డు ప్రమాదం, గుండెపోటు, అనుకోని వ్యాధి ఇలా కారణం ఏదైనా కావచ్చు. ఒక్కోసారి తినే ఆహారం కూడా కావచ్చు అందానికి ఇప్పుడు చెప్పబోయే ఘటనే ఉదాహరణ.
భోజనం చేస్తూ ఓ వ్యక్తి ఊహించని రీతిలో తన ప్రాణాలను కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పంచాయతీ యూనియన్‌లోని మలైయాంగుళం గ్రామానికి చెందిన రవి (55) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య వలర్మతి (45), కుమార్తె స్నేహ (24) ఉన్నారు. రవి తన ఇంట్లో భోజనం చేస్తూ ఉడికించిన కోడిగుడ్డును నమలకుండా అలానే మింగేశాడు.

అయితే గుడ్డు అతని గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టమై విలవిలలాడాడు రవి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని పడూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రవి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషాద వార్తతో మలైయాంగుళం వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా అనిపించినా, వాస్తవానికి ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది గొంతులో ఆహారం ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారి తీస్తుందో చెప్పడానికి రవి ఘటన మరో ఉదాహరణ అంటూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications