ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంలో-ఆ పానీ పురి వ్యాపారి ఏం చేశాడంటే-వందలాదిగా తరలివచ్చిన జనం...
ఆడపిల్ల అంటేనే గుండెల మీద కుంపటి అనే అనాగరిక భావన ఇప్పటికీ చాలామందిలో బలంగా నాటుకుపోయి ఉంది. ఇంకా పురిటి వాసనైనా పోకముందే పసిబిడ్డలను చెత్త కుప్పల్లో పడేసే ఘటనలు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.లింగ వివక్షకు తావు లేని,స్త్రీ పురుష సమానత్వం సాధించినప్పుడే సమాజం పురోగతి చెందుతుందని ఎందరో మహానుభావులు సెలవిచ్చారు. ఒక సమాజ పురోగతికి కొలమానం స్త్రీ అభివృద్దేనని డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ముఖం చిట్లించేవారు... కనీసం బిడ్డను చూసేందుకు కూడా వెళ్లని తండ్రులు ఈ సమాజంలో కోకొల్లలు. ఇందుకు భిన్నంగా ఆడపిల్ల అంటే మహాలక్ష్మిలా భావించే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు.మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ పానీపురి వ్యాపారి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం...

ఎవరా వ్యక్తి...
మధ్యప్రదేశ్‌లోని కోలార్‌కి చెందిన అంచల్ గుప్తా(28) అనే పానీపురి వ్యాపారికి ఆగస్టు 17న కూతురు పుట్టింది. కూతురు పుట్టిందన్న సంతోషంతో ఇటీవల కోలార్ పట్టణంలో రూ.50వేల ఖర్చుతో స్థానికులకు ఉచితంగా పానీపురి అందించాడు. నిజానికి అతనో చిన్న వ్యాపారి... ఆ రూ.50వేలు మళ్లీ సంపాదించాలంటే అతనికి చాలానే సమయం పడుతుంది. అయినప్పటికీ కూతురు పుట్టిందనే సంతోషం ముందు అదేమంత ఖర్చుగా అతను భావించలేదు.

ఎందుకిలా చేశానంటే... : అంచల్ గుప్తా
'ఆగస్టు 17న నాకు కూతురు పుట్టిందని తెలియగానే... మేఘాల్లో తేలినంత సంతోషపడ్డా... కానీ కూతురు పుట్టిందని చెప్పగానే కొంతమంది నన్ను నిరుత్సాహపరిచారు.ఇక ఇప్పటి నుంచి నీకు అన్నీ ఖర్చులే అని కొందరంటే... మరికొందరు ముఖం అదోలా పెట్టారు. నాకిది నచ్చలేదు. అందుకే ఓ ఆడపిల్ల తండ్రిగా సమాజానికి బలమైన సందేశం పంపించాలనుకున్నా. కూతురు పుట్టిన సంతోషాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను.నాకు చేతనైనంతలో ఏం చేద్దామని ఆలోచించి... చివరకు ఉచిత పానీపురి పంపిణీ చేయాలనుకున్నాను.తద్వారా సమాజంలో ఆడపిల్లలు,మగపిల్లలు ఇరువురు సమానమేనని... వివక్షకు తావు లేదని చెప్పదలుచుకున్నాను.' అని అంచల్ గుప్తా పేర్కొన్నారు.

వందలాదికి వచ్చిన జనం...
అనుకున్నట్లుగానే ఇటీవల కోలార్ పట్టణంలోని భీమా కుంజ్ రోడ్డులో మూడు స్టాల్స్ పెట్టి పానీపురి పంపిణీ చేశారు అంచల్ గుప్తా. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉచిత పానీపురి పంపిణీ కార్యక్రమం కొనసాగింది. స్థానికుల నుంచి దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.వందలాది మంది పానీపురి తినేందుకు వచ్చారు. దీంతో స్టాల్స్ ఎదుట భారీ క్యూ లైన్స్ కనిపించాయి. అయితే చాలామంది కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడంపై అంచల్ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే అక్కడికి వచ్చినవారిలో చాలామంది తనను అభినందించారని అంచల్ పేర్కొన్నారు.కొంతమంది అసలు విషయం తెలిసి షాక్ కూడా తిన్నారని అన్నారు. ఏదేమైనా అంచల్ గుప్తా చేసిన ఈ ప్రయత్నం స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి తండ్రులు ఇప్పటి సమాజానికి అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video

ఆడపిల్లల పట్ల మారుతున్న సమాజ వైఖరి...
గతేడాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన ఓ అత్తమామలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన కోడలికి ఆత్మీయంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ప్రసవం అనంతరం ఆడశిశువుతో ఇంటికి వచ్చిన తల్లికి కుటుంబ సభ్యులు పూలతో ఆహ్వానించారు. ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందంటూ వారి సంబరపడిపోయారు. అందరిలా కాకుండా సరికొత్తగా తమ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ఆడపిల్లల పట్ల అందరి దృక్పథం ఇలా ఉంటే సమాజంలో లింగ వివక్షకు తావు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications