మరో పెళ్లి చేసుకున్న భర్త, పబ్లిక్ టాయిలెట్లో రేప్

థానే/అహ్మదాబాద్/ముజఫర్ నగర్: 35 ఏళ్ల వ్యక్తి తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించే ప్రయత్నం చేయడంతో పాటు మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటన థానేలో జరిగింది. అభిషేక్ నట్వర్ లాల్ థానేలో ఉంటున్నాడు. ఆయన భార్య గర్భం దాల్చింది. అయితే, అబార్షన్ చేయించుకోమని అతని ఇటీవల బలవంతం చేశాడు.

మరోవైపు, అతను కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఉద్యోగం చూపిస్తానని ఆశ చూపించి, ఆ తర్వాత బుట్టలో వేసుకున్నాడు. ఆమెను ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని పైన కేసు నమోదు చేసి, అతని కోసం గాలిస్తున్నారు.

Man forces wife to abort foetus, marries another woman

పెళ్లికి ముందు రోజు భవనంపై నుండి దూకిన యువతి

29 ఏళ్ల యువతి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శివాని అనే యువతి గుర్గావ్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పెళ్లి ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, ముందు రోజు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ముజఫర్ నగర్లో మైనర్ బాలికపై అత్యాచారయత్నం

మైనర్ బాలిక పైన ముగ్గురు యువతులు అత్యాచారయత్నం చేసిన సంఘటన ముజఫర్ నగర్‌లో జరిగింది. జిజోల గ్రామానికి చెందిన యువతిని ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి కుటుంబ సభ్యులను గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జింఝానా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

అహ్మదాబాదులో మహిళ అత్యాచారం

అహ్మదాబాదులో దారుణం వెలుగు చూసింది. ఓ 40 ఏళ్ల మహిళ పైన ఆదివారం సాయంత్రం పబ్లిక్ టాయిలెట్లో అత్యాచారం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఘట్లోడియా పోలీసులు టాయిలెట్ అటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని ప్రధాన నిందితుడు అని తెలుస్తోంది.

మహిళను స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ఆమెకు గాయాలయ్యాయి. బాధితురాలు విడో అని, ఆమె మేమ్ నగర్‌లో ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. ఇది సంఘటన జరిగిన పబ్లిక్ టాయిలెట్‌కు దగ్గరలో ఉంటుంది. ఈమే ఇదే టాయిలెట్‌ను గత కొంతకాలంగా ఉపయోగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+