రేప్ కేసు నుంచి వ్యక్తికి విముక్తి: అంగీకారంతోనే కలిసి ఉంటారని కోర్టు
న్యూఢిల్లీ: ఓ మహిళకు మత్తు ఇచ్చి, అత్యాచారం చేశాడనే అభియోగాల నుంచి ఢిల్లీ కోర్టు ఓ వ్యక్తికి విముక్తి ప్రసాదించింది. మహిళ వాంగ్మూలాన్ని విశ్వసించలేమని కోర్టు చెప్పింది. పరస్పర అంగీకారంతోనే వారు కలిసి ఉంటారని అభిప్రాయపడింది. మహిళపై అత్యాచారం చేశాడనే అరోపణల కేసులో ఢిల్లీకి చెందిన అజయ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ తన నుంచి డబ్బులు లాగుతున్నాడనే మహిళ అతని కజిన్ సంతోష్‌పై చేసిన ఆరోపణలను కూడా కోర్టు తోసిపుచ్చింది.
నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ మహిళ చెప్పిన మాటల్లో పొంతన లేదని కోర్టు తేల్చి చెప్పింది. నర్సింగ్ హోంలో పనిచేస్తున్న తనకు తన సహోద్యోగి అజయ్ మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చి, తాను స్పృహ కోల్పోయిన తర్వాత సంతోష్ నివాసంలో తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది.

మహిళ వాంగ్మూలాన్ని పరిశీలిస్తే అది నమ్మదగినట్లు లేదని, సంతోష్ నివాసంలో ఆమెపై అత్యాచారం జరగకపోయి అయినా ఉండాలి లేదా ఇరువురి అంగీకారం మేరకు అఫైర్ జరిగి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. తన భర్త నుంచి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని దాచిపెట్టానని మహిళ అంటోందని, ఆ విషయాన్ని తన భర్తకు చెప్పి ఉండాల్సిందని, అదే విధంగా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయంపై కూడా చెప్పి ఉండాల్సిందని, అదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది.
బర్త్‌డే పార్టీకి వెళ్లడాన్ని తన భర్తకు చెప్పలేదని అంటున్న మహిళ అజయ్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉందని చెప్పాల్సి వస్తోందని కోర్టు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications