జరిమానా: కరెంట్ బిల్లు రూ.11 లక్షలు, వారంలో కట్టకుంటే జైలు శిక్ష

న్యూఢిల్లీ: వికలాంగుడు, తినడానికి తిండి లేదు. తాను నివసిస్తోన్న ఇంటికి రూ. 11 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు మొత్తాన్ని వారం రోజుల్లో కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పశ్చిమ ప్రాంతం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇండోర్‌లోని రమాబాయి నగర్ ప్రాంతంలో ప్రకాశ్‌ ఇంగ్లె నివసిస్తున్నాడు. ప్రకాశ్‌ ఇంగ్లె వికలాంగుడు కావడంతో అతని భార్య ఆ ప్రాంతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తూ వచ్చిన జీతంతో తొమ్మిది మంది సభ్యులున్న కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

Man gets Rs 11 lakh electricity bill, asked to pay in a week or face jail!

ప్రకాశ్‌ ఇంగ్లె తన వీధిలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ద్వారా కరెంట్‌ని వినియోగిస్తున్నాడంటూ పవర్ డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన విజిలెన్స్ అధికారులు జరిమానా కింద ఆ కుటుంబానికి రూ. 11,15,762 కరెంటు బిల్లు వేసినట్లు ఓ నోటీసు జారీ చేశారు.

అంతేకాదు ఈ మొత్తాన్ని వారం రోజుల్లో కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ నోటీసుల పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ జరిమానా నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ప్రకాశ్‌ ఇంగ్లె కుటుంబ సభ్యలు అందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+