ఆందోళనకారులు రాళ్లు రువ్వుతుండగా.. చిన్నారిని ఎత్తుకొని పరుగు.. కవర్ చేసిన పోలీసులు
ఆర్మీ అగ్నిపథ్ రక్షణ నియామక ప్రక్రియ జ్వాల కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అగ్నిపథ్‌లో కీలక అంశాలు తెలియజేయడంతో యువత ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ మధురలో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
అయితే ఒకతను చిన్నారిని తీసుకొని పరుగెడుతున్నారు. ఆ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. అతనిని ఆందోళనకారుల నుంచి పోలీసులు కవర్ చేశారు. ఆ వెంటనే పిల్లాడితో సహా వెళ్లిపోయాడు. పశ్చిమ యూపీ జిల్లాలో గల జాతీయ రహదారి వద్ద ఘటన జరిగింది. అక్కడే గల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

నిరసనకారులు మాత్రం బస్సులు, కార్లు, కిటికీ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఆందోళనలకు సంబంధించి విజువల్స్ వైరల్ అయ్యాయి. రక్షణ శాఖలో గ్రాట్యుటీ, పెన్షన్ లేకుండా అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టింది. రిక్రూట్‌మెంట్ వయస్సు పరిమితిని 23 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించారు. దీంతో యువత ఆందోళన బాట పట్టింది.
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. పథకానికి వ్యతిరేకంగా నిరసలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరభారతానికి పరిమితం అయిన ఆందోళనలు తెలంగాణ రాష్ట్రానికి చేరాయి. నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెను విధ్వంసం సృష్టించారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకురు మృతి చెందగా.. మరికొందరు యువకులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications