తమ భార్యలను తిట్టాడని స్నేహితుడ్ని చంపేశారు

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాదత్‌గంజ్‌లోని కత్రా కుడయార్ ఖాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితుడు లవకుష్ మిశ్రా శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆ తర్వాత అతని ఆచూకీ లభించకపోవడంతో బజర్ఖాలా పోలీసులను ఆశ్రయించారు.
కాగా తా్కతోరా ప్రాంతంలోని చత్రియా లాన్ దగ్గర లవకుష్ మిశ్రా మృతదేహం ఆదివారం లభ్యమైంది. అతని శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది. పెట్రోల్ పోసి అతన్ని కాల్చివేసినట్లు పోలీసులు అంచనా వేశారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మిశ్రాను గుర్తించిన పోలీసులు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిశ్రా ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నిందితులైన బాలగంజ్, థాకూర్గంజ్‌లకు చెందిన అజయ్ వర్మ(36), వినాయక్ వర్మ అలియాస్ అన్షు(19), సాదత్‌గంజ్‌కు చెందిన జితేంద్ర కశ్యప్(34)లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
నిందితుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం మిశ్రాతోపాటు ఈ ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అయితే ఈ సమయంలోనే చిన్న గొడవ తలెత్తింది. మద్యం ఎక్కువగా సేవించిన మిశ్రా.. మిగితా వారి భార్యల గురించి తప్పుగా, అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి గురైన ముగ్గురు మిశ్రాపై దాడి చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పింటించినట్లు నిందితులు అంగీకరించారు.












Click it and Unblock the Notifications