రూ. 40, బియ్యం కోసం యజమానిని హత్య చేశాడు

Man killed for Rs 40 and some rice
రాంచీ: తనకు ఇవ్వాల్సిన రూ. 40 వేతనం, బియ్యం ఇవ్వలేదని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన యజమానిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఘట్‌సిలాలోని భిటర్మిండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యజమాని(52) ఓ గిరిజన వ్యక్తిని పశువులను మేపడానికి పనిలో పెట్టుకున్నాడు. అతడికి రూ. 40 జీతం, కొన్ని కొన్ని బియ్యం వేతనంగా ఇవ్వాలని నిర్ణయించాడు.

కాగా, అవి ఇవ్వడానికి ఆలస్యం చేస్తుండటంతో యజమానితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి యజమానిని కత్తితో పొడిచి హత్య చేశాడని దుమారియా పోలీసు అధికారి విపిన్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన ఆయన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యజమాని మృతదేహాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. అతని వద్ద పనిచేస్తున్న నిందిత వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+