టీ షర్ట్ కోసం ఫ్రెండ్ ని కిరాతకంగా మర్డర్.. ఎక్కడంటే ?
క్షణికావేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే.. ఖచ్చితంగా షాక్ అవుతాం. పాత కక్షల నేపథ్యంలో, రాజకీయాల కోసం కూడా ఏళ్ల తరబడి గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే డబ్బుల కోసం, ఆస్తుల కోసం, బంగారం కోసం పలు కారణాలతో ఇన్నాళ్లు గొడవలు జరగడం చూశాం. కానీ ఒక టీ షర్ట్ కోసం గొడవపడి సొంత స్నేహితుడిని దారుణంగా హత్య చేయడం కలకలంగా మారింది.
టీ-షర్టు కోసం చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. స్థానిక శాంతి నగర్ లో శుభమ్ హర్నే, అక్షయ్ ఆసోల్ అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తున్నారు. రీసెంట్ గానే ఆసోల్ ఆన్‌లైన్‌లో రూ. ౩౦౦ తో టీ షర్ట్ కొనుగోలు చేశారు. అయితే టీ షర్ట్ అతడికి సరిపోకపోవడంతో శుభమ్‌కి ఇచ్చాడు. శుభమ్ టీ షర్ట్ తీసుకున్నప్పటికీ.. డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో వారి మధ్య వివాదం చెలరేగింది.

ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో శుభమ్ అక్షయ్‌ని తిడుతూ డబ్బును అతడిపైకి విసిరాడు. దాంతో అక్షయ్ అతడి సోదరుడు ప్రయాగ్ అసోల్ కలిసి.. శుభమ్ గొంతు కోసి హత్య చేశారు. ఘటనలో శుభమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో నిందితులు ఇద్దరు మద్యం తాగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు. శుభమ్ హర్నే, అక్షయ్ ఆసోల్, ప్రయాగ్ అసోల్ కి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications