పక్కింటి మహిళతో అక్రమ సంబంధం: పెళ్లి చేసుకోవడానికి కూతురి హత్య
హైదరాబాద్: పక్కింటి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి కన్నకూతురిని అడ్డంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - హరిదాస్ నగర్‌లోని డిచౌన్ ప్రాంతంలో నివాసం ఉండే మహావీర్ (35)కు పక్కింటి మహిళతో అక్రం సంబంధం పెట్టుకున్నాడు.
ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నడాు. అది తన కూతురికి ఇష్టం లేదని మహావీర్ తెలుసుకున్నాడు. దీంతో గొంతు కోసి ఆ 11 ఏళ్ల అమ్మాయిని చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. అతని మొదటి భార్య భర్త వ్యవహారం ెతలిసి నెల క్రితమే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

మొదటి భార్య ఏప్రిల్ 23వ తేదీన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణం కూడా అతని అక్రమ సంబంధమే. తాను తన కూతురిని చంపానని, లొంగిపోతానని మహావీర్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications