బలవంతంగా విషం తాగించి కోడలిని చంపాడు
చెన్నై: తమిళనాడులోని సేలం సమీపంలోని వల్లియూరు గ్రామానికి చెందిన ఓ తండ్రికి తన కుమారుడితో అతని భార్య తుళ్లుతూ నవ్వుతూ ఉండడం ఎంతమాత్రం నచ్చలేదు. కొడుకు భార్య నవ్వుతూ తుళ్లుతూ ఉండటాన్ని సహించలేని అతను ఆమెతో బలవంతంగా విషం తాగించి హత్య చేశాడు.
తమిళనాడులోని సేలం వల్లియూరులో 63 ఏళ్ల పరమశివం తన కుమారుడుకి 26 ఏళ్ల భారతితో పెళ్లయింది. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి కుమారుడు తన జీతాన్ని మొత్తం కోడలు చేతిలో పెట్టి ఇంటి ఖర్చులు, ఇతరత్రా అన్నీ ఆమెనే చూసుకోమన్నాడు. కానీ అది పరమశివంకు నచ్చలేదు.

కోడలికి డబ్బు ఇవ్వవద్దని ఎన్నోమార్లు చెప్పినా, అతడు పట్టించుకోలేదు. తన భార్య మాత్రమే పొదుపుగా డబ్బు ఖర్చు చేస్తుందని, ఇది ఎవరూ చేయరని అతడు గట్టిగా చెప్పేశాడు. దీంతో తన కొడుకు తన మాట వినడంలేదు కనుక డబ్బు తీసుకుంటున్న కోడలిని హత్య చేయాలని నిర్ణయించుకుని ఆమెతో బలవంతంగా విషం తాగించాడు.
ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నదని ఇరుగుపొరుగుకు చెప్పాడు. ఐతే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇది 2008 జూన్ నెల 7న జరిగింది. దీనిపై సేలం కోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ పరమశివం దోషి అని తేల్చి అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications