భార్య చంపి తలను రంపంతో కోసేశాడు: 3 రోజులు శవం పక్కనే...

ఓ వ్యక్తి భార్యను హత్య చేసి, మొండెం నుంచి తలను రంపంతో కోసి వేరు చేశాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు భార్య శవంతోనే పడుకున్నాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి మొండెం నుంచి తలను రంపంతో వేరు చేసి ఓ వ్యక్తి అత్యంత ఘాతుకంగా వ్యవహరించాడు. భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది.

మూడు రోజుల పాటు అతను భార్య మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఢిల్లీలోని మధు విహార్ అనే ప్రాంతంలో సుబోధ్ కుమార్ (40) ్నే వ్యక్తి భార్య మనీషాతో కలిసి ఉంటున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యకు తెలియకుండా అతను ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు.

Man kills wife, sleeps with body for 3 days

రెండో పెళ్లి విషయం భార్య మనీషాకు తెలిసింది. దీంతో ఆమె అతన్ని నిలదీసింది. దాంతో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. తనకు విడాకులు ఇవ్వాలని భార్య మనిషా సుబోధ్‌ను అడిగింది. అయితే, అందుకు అతను నిరాకరిస్తూ తాను చెప్పినట్లు పడి ఉండాలని హెచ్చరించాడు .

పిల్లలను ముందుగానే తన అత్తామామల వద్దకు అతను పంపించాడు. శనివారం రాత్రి ఆమెపై దాడి చేసి, పదే పదే తలపై కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. మృతదేహాన్ని బయటకు తీసుకుని వెళ్లే వీలు కాక రంపాన్ని తెచ్చి ఆమె తలను మొండెం నుంచి వేరు చేశాడు. దేహాన్ని ముక్కలు చేసి సంచుల్లో నింపడానికి సిద్దపడ్డాడు.

అయితే, మూడు రోజులు గడిచిపోవడం ఇంట్లోంచి దుర్వాసన రావడం ప్రారంభించింది. దాంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో అసలు విషయం బయటపడింది. తాను నేరం చేసినట్లు సుబోధ్ అంగీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+