వివాహేతర సంబంధం ఒప్పుకోలేదని భార్య హత్య
చెన్నై: తమిళనాడులోని తిరువల్లూరులో దారుణం జరిగింది. తనను మరో మహిళతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదనే కోపంతో తన భార్యను అత్యంత పాశవికంగా బండరాయితో మోది చంపాడు ఓ కిరాతక భర్త. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. కాళిముత్తు అనే నిందితుడు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి నదియా(25)అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ప్రియ(7), ఆండియా(5), రాకీ (2) ఉన్నారు. కాగా, గత కొద్ది నెలలుగా కాళిముత్తు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నదియాకు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ నేపథ్యంలో గత మంగళవారం కాళిముత్తు.. ఆ మహిళతో కలిసి ఉన్నాడని కొందరు నదియాకు చెప్పారు. దీంతో ఈ విషయాన్ని నదియా తన సోదరుడు కళైవనణ్‌కు తెలిపింది. అతడు ఆమె ఇంటికి వచ్చి కాళిముత్తుతో గొడవకు దిగాడు. ఈ పరిణామంతో నదియాపై కోపం పెంచుకున్న కాళిముత్తు బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
అర్థరాత్రి కావడంతో నదియా, పిల్లలతోపాటు నిద్రపోతోంది. అదే సమయంలో ఓ పెద్ద బండరాయితో నదియా తలపై మోదీ ఆమెను హత్య చేశాడు కాళిముత్తు. ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు. పిల్లల అరుపులు విన్న పొరుగువారు ఘటన స్థలానికి చేరుకోగా, నదియా నిర్జీవంగా పడివుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నదియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications