వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ఏందిది..? పార్క్ చేసిన బైక్ నుంచే సీసీ రోడ్డు, అందుకు పర్మిషన్ ఇవ్వలేదట..?

|
Google Oneindia TeluguNews

కొన్ని కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును.. ఆ పని చేసే సమయంలో చూస్తారా.. చూడారా అర్థం కాదు. మరీ ఇంత ఆ జాగ్రత్తగా ఉంటారా అనే సందేహాం కలుగుతుంది. తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. పార్క్ చేసిన బైక్ మీద నుంచే సీసీ రోడ్డు వేశారు. ఇంకేముంది సదరు వ్యక్తి పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పటిలాగే బైక్ పార్క్ చేసి..

ఎప్పటిలాగే బైక్ పార్క్ చేసి..

వెల్లూర్ మున్సిపాలిటీలో గల గాంధీ రోడ్ ప్రాంతంలో ఎస్ మురుగన్ రోజూలాగే సాయంత్రం తన బైక్ ను ఇంటి ముందు పార్క్ చేశాడు. ఆ తర్వాత బయటికి రాలేదు. రాత్రి ఇంట్లోనే పడుకున్నాడు. ఉదయం లేచి బయటికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. బైక్ తాళాలు తీసుకుని బయటికి వచ్చాడు. ఇంటి ముందు బైక్ చూసి నోరెళ్లబెట్టాడు. రాత్రి ఆ గల్లీలో సిమెంట్ రోడ్డు వేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బైక్ అలా ఉండగానే సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. దాంతో బైక్ ముందు, వెనక టైర్లు, స్టాండ్ ఆ సిమెంట్ రోడ్డులో చిక్కుకుపోయి ఉన్నాయి.

రాత్రి 11 గంటల వరకు

రోజూ ఇంటి ముందే బైక్ పార్క్ చేస్తానని మురుగన్ చెబుతున్నారు. ఇంటి ముందు బైక్ పెట్టానని.. రాత్రి 11 గంటల వరకు కూడా ఇంట్లో నిద్ర పోకుండా ఉన్నానని వివరించారు. పిలవకుండా బైక్ అలా ఉంచే రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై నీళ్లు డ్రైనేజీలోకి వెళ్లే పైపులను సిమెంట్‌తో మూసేశారని మండిపడ్డారు.పార్క్ చేసిన బైక్ అలాగే ఉంచేసి రోడ్డు వేయడంపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పర్మిషన్ ఇవ్వలేదే..?

పర్మిషన్ ఇవ్వలేదే..?

ఈ ఘటన దుమారం రేపింది. దీంతో వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. ఆ ప్రాంతంలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్‌కు అనుమతి ఇవ్వలేదని.. రోడ్డు ఎలా వేశారని కమిషనర్ అడిగారు. ఇలాంటి ఘటనలు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెడ్డపేరు తెస్తాయని.. కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం అని పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకంటే బైక్ చూడకుండా రోడ్డు వేయడం.. అయితే దానికి పర్మిషన్ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

English summary
Tamil Nadu resident was left stunned after he found the wheels of his parked motorcycle stuck in freshly laid concrete in Vellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X