వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతనో టెక్కీ: 3 ఏళ్లుగా భార్యను ఇంట్లో, కూతుర్ని టాయిలెట్లో నిర్బంధించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కోపంతో ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. తన భార్యను, తొమ్మిదేళ్ల వయసున్న కూతురును మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉంచాడు. కూతురిని మాత్రం టాయ్‌లెట్‌లో బంధించి రోజుకు కేవలం రెండంటే రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చాడు. ఆ చిన్నారి ఒంటి మీద దుస్తులు లేవు.

వారికి ప్రతి రోజూ చావుదెబ్బలు రుచి చూపిస్తున్నాడు. కొడుకుని మాత్రం చక్కగా తయారు చేసి రోజూ బడికి పంపుతున్నాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలంగాణ వాసి రామేశ్వర్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్న అతని భార్య ప్రియాంక (32), తమ పొరుగింటి వ్యక్తి సాయంతో వరంగల్‌లోని తన తల్లిదండ్రులకు కాల్ చేసి ఎట్టకేలకు ఈ నరకం నుంచి బయటపడింది.

 Man locks wife and daughter inside the house

వరంగల్‌కు చెందిన ప్రియాంకకు 2004లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రామేశ్వర్‌తో పెళ్లయింది. కొన్నాళ్లకు ప్రియాంక గర్భవతి కాగానే స్కాన్ చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రియాంక అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత విడాకుల కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఫ్యామిలీ కౌన్సిలర్ల జోక్యంతో వెనక్కి తగ్గాడు.

ఈ క్రమంలో ప్రియాంక ఒక అబ్బాయికి కూడా జన్మనిచ్చింది. ఇప్పుడైనా కష్టాలు తగ్గుతాయని ఆమె భావించింది కానీ, పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయాయి. అందుకు కారణం, రామేశ్వర్ తల్లి, తమ్ముడు కూడా వచ్చి చేరారు.

చెన్నైలోని పెరుంగుళత్తూర్ ప్రాంతంలో రామేశ్వర్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ప్రియాంక, ఆమె కూతురికి బందీఖానాగా మారిపోయింది. బయటివారితోను, ప్రియాంక తల్లిదండ్రులతోను సంబంధాలు లేకుండా చేశారు. కూతురిని టాయ్‌లెట్‌కు పరిమితం చేసి, రోజుకు రెండు ఇడ్లీలు మాత్రం పెడుతున్నాడు రామేశ్వర్. చివరికి అతికష్టం మీద పొరుగువారి ద్వారా తాంబరం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌కు ప్రియాంక ఫోన్ చేసి ఈ భూతగృహం నుంచి బయటపడింది. అయితే, ఇంత జరిగినా రామేశ్వర్ మీద ఫిర్యాదు చెయ్యడానికి బదులు, స్వంతూరికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలిసుండాలని ప్రియాంక నిర్ణయించుకున్నట్టు సమాచారం.

English summary
A techie, Parameswar from Warangal of Telangana state in Chennai locked his wife and daughter inside the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X