ఇదేం రివేంజ్ సార్.. వేరే వ్యక్తితో భార్య జంప్.. లేపుకెళ్లిన వ్యక్తి భార్యను ఏం చేశాడంటే ?
ఏం జరుగుతుందో.. ఈ సమాజం ఎటు పోతుందో అర్ధం కానీ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఓ వైపు భార్యలని భర్తలు.. భర్తలను భార్యలు హత్యలు చేయడం.. మరోవైపు వరుసలు సైతం పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇదే తంతు నడుస్తూ సభ్యసమాజాన్ని సైతం తలదించుకునేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఏఏ పరిస్థితుల్లోనే బీహార్‌లో జరిగిన ఒక విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని పారిపోగా.. ఆ పారిపోయిన వ్యక్తి భార్యను వివాహం చేసుకున్నాడు ఓ భర్త. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా సినిమా కథను తలపించేలా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఖగారియాకు చెందిన నీరజ్ కుమార్ 2009లో రూబీ దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. మొదట్లో అంతా సజావుగా సాగినా.. కొంతకాలానికి రూబీ దేవి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన నీరజ్.. భార్యను హెచ్చరించినా ఆమె మారలేదు. తరచూ గొడవలు జరుగుతుండగా, చివరికి 2022 ఫిబ్రవరిలో రూబీ దేవి తన భర్తను, పిల్లలను వదిలేసి ముఖేష్‌తో పారిపోయింది.

కాగా తన భార్య కనిపించకపోవడంతో షాక్‌కు గురైన నీరజ్, ఖగారియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మొదట ఆయన ఇది కిడ్నాప్ కేసుగా భావించాడు. కానీ పోలీసులు విచారణ జరిపినా ఆ జంటను కనుగొనలేకపోయారు. వారు రహస్యంగా వేరే ప్రాంతానికి వెళ్లి సహజీవనం ప్రారంభించారని సమాచారం. దీంతో నీరజ్ గ్రామ పెద్దల దగ్గర న్యాయం కోరినా ఎటువంటి పరిష్కారం దొరకలేదు. చివరికి నిరాశతో జీవనం కొనసాగిస్తున్న నీరజ్, తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనే ఆలోచనలో పడ్డాడు.
ఇంతలోనే నీరజ్‌కు ఆశ్చర్యకరమైన సమాచారం దొరికింది. అతని భార్యతో పారిపోయిన ముఖేష్‌కు కూడా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఆమె పేరు కూడా రూబీగానే ఉండటం విశేషం. అయితే నీరజ్, ముఖేష్ భార్యను కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఇద్దరికీ బాధ ఒక్కటేనని.. తమ జీవిత భాగస్వాములు వేరే వ్యక్తులతో పారిపోయారని.. అందుకు మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెను ఒప్పించాడు. అయితే అందుకు ఆమెకు అంగీకరించడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని.. లేచిపోయిన జంటకు గుణపాఠం నేర్పారు.
ఇక ఈ సంఘటన జరిగినది రెండు సంవత్సరాల క్రితమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఒక స్థానిక న్యూస్ బ్లాగ్ ఈ కథను వీడియో రూపంలో ప్రచురించడంతో అది మళ్లీ వైరల్ అయింది.
ఇంటర్నెట్ వినియోగదారులు ఈ కథను "భార్యకు భార్య చెల్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇదో కొత్త రకం రివేంజ్ లవ్ స్టోరీ అని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications