ఛీ..ఛీ ఇదేం పాడు పని: మహిళా జర్నలిస్టును చూసి వీడు ఏంచేశాడంటే..?

అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. నేరాలు ఘోరాలు అక్కడ ఎక్కువే. మహిళలు ఒంటరిగా కనిపించినా లేదా జనసమూహంలో కనిపించినా కామాంధులు మాత్రం వారిని వదలడం లేదు. వారిపై మృగంలా దాడిచేస్తున్నారు. తాజాగా లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న బస్సులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు.

ఢిల్లీ బస్సులో మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు

ఢిల్లీ బస్సులో మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు

ఢిల్లీ... నేరాలకు ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఒంటరిగా మహిల కనిపిస్తే చాలు అమాంతంగా తెగబడిపోతున్నారు కామాంధులు. బహిరంగ ప్రదేశమైనా... లేక జనసమర్దత లేని ప్రాంతమైనా ఏదైనా సరే యువతి కనిపించడమే తరువాయి లైంగికం వేధింపులకు దిగుతున్నారు. తాజాగా ఢిల్లీలో రద్దీగా ఉన్న బస్సులో ఓ ఛానెల్‌కు చెందిన టీవీ జర్నలిస్టు కూర్చున్న పక్కసీటులోనే ఓ వ్యక్తి కూర్చుని ఆకృత్యాలకు పాల్పడ్డాడు. ఆమె వంక చూస్తూ హస్తప్రయోగం చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా జర్నలిస్టు ఒక్కసారిగా ఆ యువకుడి చెంప చెళ్లు మనిపించింది.

 మహిళా జర్నలిస్టును చూసి హస్తప్రయోగం చేసిన కామాంధుడు

మహిళా జర్నలిస్టును చూసి హస్తప్రయోగం చేసిన కామాంధుడు

తన విధులు ముగించుకుని కపషెరా నుంచి తన నివాసమున్న సంగం విహార్‌కు వెళ్లేందుకు మంగళవారం రాత్రి 517 నెంబరు బస్సు ఎక్కింది మహిళా జర్నలిస్టు. బస్సు ఎక్కి ఒక సీటులో కూర్చొంది. ఆమె పక్కనే మరో సీటు ఖాళీగా ఉండటంతో ఆమె పక్కనే మరో ముఖేష్ రంజన్ కుమార్ అనే యువకుడు కూర్చున్నాడు. బస్సు కదిలి కొంత దూరం వెళ్లగానే ఆ ముఖేష్ మహిళా జర్నలిస్టును చూస్తూ హస్తప్రయోగం చేశాడు. అయితే కాసేపు ఇబ్బంది పడ్డ జర్నలిస్టు ఒక్కసారిగా కేకలు వేసి పక్కనే ఉన్న ముఖేష్‌ చెంప చెల్లుమనిపించింది. అంతేకాదు చెప్పుతీసుకుని కొట్టింది. ఏమి జరుగుతోందో అని బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.

బస్సులోనే ముఖేష్‌ను కట్టేసి పోలీసులకు ఫోన్ చేసిన జర్నలిస్టు

బస్సులోనే ముఖేష్‌ను కట్టేసి పోలీసులకు ఫోన్ చేసిన జర్నలిస్టు

బస్సులోనే ముఖేష్‌ను చితకబాదిన మహిళ అతడిని అదే బస్సులో కట్టేసి పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. అప్పటికే బస్సు ప్రయాణికులతో నిండిపోయి ఉంది.ముఖేష్‌ను గద్దించేందుకు ఎవరూ ముందుకు రాలేదని మహిళా జర్నలిస్టు తెలిపింది. అతన్ని చెప్పు తీసుకుని కొడుతుండగా మరో వ్యక్తి తనను ఆపే ప్రయత్నం చేశాడే తప్ప ముఖేష్ఋకు బుద్ది చెబుదామన్న ఆలోచన చేయలేదని తెలిపింది. ఒకే ఒక ప్రయాణికుడు సహాయం చేద్దామని వచ్చాడని అయితే సాక్ష్యం చెప్పేందుకు మాత్రం ముందుకు రాలేదని తెలిపింది. బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులు ముఖేష్‌ను అరెస్టు చేసి అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ప్యాంటు జిప్ తీసి అసభ్యకరంగా ప్రవర్తించిన ముఖేష్

ప్యాంటు జిప్ తీసి అసభ్యకరంగా ప్రవర్తించిన ముఖేష్

బస్సులో మహిళలకు కేటాయించిన సీట్లలో తాను కూర్చున్నట్లు చెప్పిన జర్నలిస్టు ఆతర్వాత కొద్దిసేపటికి ముఖేష్ అనే వ్యక్తి వచ్చాడని తనవైపు అలానే చూశాడని జర్నలిస్టు వెల్లడించింది. తను కూడా ముఖేష్ వైపు కోపంగా చూసినట్లు చెప్పింది. అయినప్పటికీ ముఖేష్ బెదరలేదని చిన్నగా తను ధరించిన ప్యాంట్ జిప్పుతీసి చేయి లోపలికి పెట్టి చాలా అసహ్యంగా ప్రవర్తించాడని జర్నలిస్టు తెలిపింది. ఇలాంటి ఘటనలు ఢిల్లీలో తరుచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఓ మధ్య వయసున్న వక్తి 23 ఏళ్ల యువతి పక్కన కూర్చుని తనను లైంగికంగా వేదించడమే కాకుండా హస్తప్రయోగం చేసిన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనను తన కెమెరాలో బంధించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+