కిలాడీ లేడీలు: మత్తు మందిచ్చి వృద్ధుడ్ని దోచేశారు
అహ్మదాబాద్: ఓ 50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దారుణంగా మోసం చేసిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు మహిళలతో పాటు మరో వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని రాజ్ కోట్‌కు చెందిన పర్సోత్తమ్ మార్వియాకు ఐదుగురు సంతానం.
వీరిలో ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుర్లు. మూడేళ్ల క్రితం అతడికి భార్య చనిపోయింది. దీంతో అతడు తన రోజవారీ కార్యక్రమాలను చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలసి అతనికి తోడు కోసం మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా షీలా అనే మ్యారేజి బ్రోకర్‌ను సంప్రదించారు. దీంతో షీలా... పర్సోత్తమ్‌కు మంచి సంబంధం చూసి పెడతానని అహ్మదాబాద్ కు రావాలని ఆహ్వానించింది. పర్సోత్తమ్ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న షీలా అక్కడ అతడికి ముగ్గురు మహిళలను చూపించింది.
వారిలో మంజుల అలియాస్ మోనా వాఘెలా(37), డైసీ మక్వాన్ (45), షీలా క్రిస్టియాన్(54)లు ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరూ అతడికి నచ్చక వద్దని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ మరోసారి ఫోన్ చేసి అహ్మదాబాద్ పిలిపించి ఇద్దరు మహిళలని చూపించింది. ఆ ఇద్దరిలో తొలుత చూపించిన మంజలు కూడా ఉంది.

మంజలతో పాటు రెండోసారి చూపించిన మహిళ కూడా నచ్చలేదని చెప్పి పర్సోత్తమ రాజ్‌కోట్ వెళ్లిపోయాడు. మళ్లీ కొన్ని రోజులకు పర్సోత్తమ్‌కు ఫోన్ చేసి షీలా తానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో అతడు ఫోన్ పెట్టేయగా మరోసారి ఫోన్ చేసి తాను ఎంతో ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించింది.
షీలా బెదిరింపులకు భయపడిన పర్సోత్తమ్ రాజ్‌కోట్ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. దీంతో మందుగానే ఓ హోటల్ గదిని బుక్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. హోటల్‌కు మందుగానే చేరుకున్న మంజుల మంచినీళ్లలో మత్తుమందును కలిపి అతడికి ఇచ్చింది. దీంతో అతడు మత్తులోకి జారుకోగానే ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా ఉన్నట్లుగా ఫోటోలు తీశారు.
ఆ తర్వాత పర్సోత్తమ్ వేసుకున్న దుస్తులతో సహా మొత్తం దోచుకెళ్లారు. వేరే మహిళతో పర్సోత్తమ్ కలిసి ఉన్నట్టు తీసిన అసభ్యకర చిత్రాలను చూపించి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారు. ఆ ఫోటోలు తిరిగి ఇవ్వాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే చివరకు రూ. 5 లక్షలు ఇచ్చేందుకు పర్సోత్తమ్ అంగీకరించాడు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యలుకు తెలియజేయడంతో వారు రాజ్ కోట్ పోలీసులకు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా లేడీ కిలాడీలను ఓ పథకం ప్రకారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications