వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్ల కోసం దీక్ష, దీక్ష శిబిరంలోనే వివాహం, భర్త అడుగు జాడల్లోనే భార్య...

రిజర్వేషన్ల కోసం నిరహరదీక్షలో కూర్చొన్న యువకుడు నిరహరదీక్ష శిబిరాన్నే పెళ్ళి మంటపంగా చేసుకొన్నాడు. నిరహరదీక్ష శిబిరంలోనే తనతో వివాహం నిశ్చయమైన యువతితో దీక్ష శిబిరంలో వివాహం చేసుకొన్నాడు. తన డిమాండ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్:రిజర్వేషన్ల కోసం నిరహరదీక్షలో కూర్చొన్న యువకుడు నిరహరదీక్ష శిభిరాన్నే పెళ్ళి మంటపంగా చేసుకొన్నాడు..నిరహరదీక్ష శిభిరంలోనే పక్కనే యువతి మెడలో మూడుముళ్ళు వేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లా సికిందరా ఏరియాకు చెందిన దేవరాజ్ గుజ్జర్ తో పాటు మరో పది మంది గత ఏడాది రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన ఎస్ బి సికోటా కొంది లెక్చరర్ల పోస్టులకు ఎంపికయ్యాడు.

marriage

అయితే అంతలోనే ప్రత్యేక వెనుకబడిన కులాలకు(ఎస్ బీ సి) రిజర్వేషన్లను రద్దు చేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పువెల్లడించింది.దీంతో లెక్చరర్ల పోస్టుకు ఎంపికైన వారికి కాల్ లెటర్లు అందలేదు.

దీంతో ఈ నెల 16వ, తేది నుండి ఆమరణ నిరహరదీక్షకు చేపట్టారు. దేవరాజ్ గుజ్జర్ కు మమత అనే యువతితో ఎనిమిది నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది.ఈ ఫిబ్రవరి మాసంలోనే వివాహం కావాల్సి ఉంది.

రిజర్వేషన్ల కోసం దేవరాజు దీక్ష చేస్తున్నారు.అయితే ఆయన సూచన మేరకు దీక్ష శిబిరం వద్దే వివాహన్ని ఏర్పాటుచేశారు. బందుమిత్రుల సమక్షంలోనే వివాహం జరిపించారు.

ఎస్ బి సి కోటా రిజర్వేషన్లు తిరిగి అమలయ్యేలా దాకా దీక్ష కొనసాగిస్తానని దేవరాజ్ గుజ్జర్ మీడియాకు చెప్పాడు ఎస్ బీ సి కోటా రిజర్వేషన్లు అమలయ్యే వరకు తన దీక్ష కొనసాగుతోందన్నారు.ఈ ఆందోళనలో తన ప్రాణాలు పోయినా నష్టం లేదన్నాడు.

తన భర్త ఒక మంచి ఆశయ సాధనకు దీక్ష చేపట్టడం గర్వంగా ఉందన్నారు.ప్రభుత్వం స్పందించకుంటే తాను కూడ దీక్షలో కూర్చుంటానని నవ వధువు మమత తెలిపింది.అనంతరం నవవధువు మమత అత్తవారింటికి వెళ్ళింది,దేవరాజ్ మాత్రం దీక్షలోనే ఉన్నాడు.

English summary
The site of an indefinite hunger strike for Special Backward Class quota turned into the marriage venue for 26-year-old Devraj Gujjar, who tied the nuptial knot here, as he chose not to leave the protest. Gujjar is one of the 10 men who are protesting since February 16 the scrapping of quota to Special Backward Classes in Rajasthan by the high court in December last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X