కోడలిపై వారాలపాటు అత్యాచారానికి పాల్పడిన మామ: ఫిర్యాదు
లక్నో: వరుసకు మామ అయ్యే వ్యక్తి తనపై కొద్ది వారాలుగా అత్యాచారానికి పాల్పడున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనపై ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ధనియాపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రామ ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘నాపై మా మామ పలుమార్లు బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకుముందే పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాను. కానీ వారు అతనిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. దీంతో నిందితుడు నాపై మరోసారి అత్యాచారానికి ప్రయత్నించాడు. నేను గ్రామస్తులను సాయం చేయమని కోరాను' అని బాధితురాలు తెలిపింది.

తన మానసిక వికలాంగుడని, అతడు పని చేసి తనను పోషించే స్థితిలో లేడని చెప్పింది. దీన్ని ఆసరాగా చేసుకుని తన మామ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తాను అడ్డుకున్నప్పటికీ తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. దీంతో తాను గ్రామస్తుల సాయాన్నికోరినట్లు చెప్పింది.
కాగా, గ్రామస్తులు రూరల్ ఎస్పీని కలిసి బాధితురాలిపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఎస్పీ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications