బాలికపై ఏడాది పాటు రేప్: ఫిల్మ్ తీసి, బ్లాక్ మెయిల్ చేస్తూ...

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఆ కీచకుడు బాలికపై ఏడాది పాటు అత్యాచారం చేశాడు. లైంగిక కార్యాన్ని నిందితుడు చిత్రించి, దాంతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి

సంఘటన గురించి ఎవరికైనా చెప్తే వీడియోను ఇంటర్నెట్‌లో పెడుతానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు చెప్పింది. వీడియో చూపిస్తూ బెదిరిస్తూ తనపై అతను ఏడాది పాటు అఘాయిత్యం చేసినట్లు ఆరోపించింది.

Rape

బాలిక గర్భం దాల్చింది. అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపిఎస్‌లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి పంపించారు. నిందితుు కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man in Rampur district of Uttar Pradesh allegedly raped a girl repeatedly for one year. The accused reportedly recorded the act and then used the same to blackmail the victim.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి