పది వేళ్లూ నరికేశారు, కళ్లలో యాసిడ్ పోశారు

అతని పరిస్థితి నిలకడ ఉంది. అయితే అతనికి చూపు రావడం కష్టమేనని అంటున్నారు. బాధితుడిని వికాస్ యాదవ్‌గా గుర్తించారు. కళ్లను వైద్యుల బృందం పరిశీలిస్తున్నట్లు వైద్య కళాశాల ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ లోకేందర్ ప్రసాద్ హిందూస్తాన్ టైమ్స్‌తో చెప్పారు
యాసిడ్ కార్నియాను పూర్తిగా కాల్చివేసిందని, రెండు చేతులకు తగిలిన గాయాలు నయమవుతున్నాయని ఆయన చెప్పారు. యాదవ్‌పై దుండగులు గత గురువారంనాడు దాడి చేశారని హిందుస్తాన్ టైమ్స్ రాసింది. బాధితుడు పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో గల సమస్తీపూర్ జిల్లాలోని వన్బౌర్ గ్రామానికి చెందినవాడు.
యాదవ్‌కు నేర చరిత్ర ఉందని, అతనిపై ప్రత్యర్థి ముఠా పైచేయి సాధించిందని పోలీసులు అంటున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications