తండ్రి అతనేనా: పది నెళ్ల తర్వాత శవాన్ని తవ్వి తీశారు

ముంబై: పది నెలల తర్వాత ఓ వ్యక్తి శవాన్ని సమాధి నుంచి పోలీసులు తవ్వి తీశారు. హోటల్ మేనేజ్‌మెంట్ నిపుణుడైన మెల్విన్ ఫెర్నాండెజ్ అమెరికాలో పది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. డిఎన్ఎ నమూనాలను సేకరించే ఉద్దేశంతో పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు ఆయన శవాన్ని బయటకు తీశారు.

పది రోజుల క్రితం ఆయన సహచరికి పుట్టిన బిడ్డకు 37 ఏళ్ల మెల్విన బయోలాజికల్ ఫాదర్ కాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్యకు ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఆ బిడ్డ పుట్టాడని ఆరోపించారు. దీంతో మెల్విన్ శవాన్ని ముంబైలోని వొర్లి పోలీసులు, నాయర్ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణులు వెలికి తీసినట్లు ఆ ఆంగ్ల మీడియాలో వార్త వచ్చింది.

తండ్రి అతనేనా: పది నెళ్ల తర్వాత శవాన్ని తవ్వి తీశారు

అమెరికాలోని వర్జనీయాలో గల ఓ హోటల్లో మెల్విన్ పనిచేసేవాడు. 2015 ఆగస్టులో అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడిని అమెరికాకు పంపించడానికి రిటైర్డ్ డ్రైవర్ ఆయన మెల్విన్ తండ్రి 2005లో రూ.3.5 లక్షలు సేకరించాడు.

కుమారుడి శవాన్ని ఇండియాకు తేవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో మెల్విన్ తండ్రి 400 మంది నుంచి ఆర్థిక సాయం తీసుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు దాదా 20 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. సమాధి చేయడానికి ఏ విధమైన పోస్టు మార్టం చేయలేదని, అతని మరణానికి గల సరైన కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నామని మెల్విన్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

పది రోజుల క్రితం జన్మించిన బిడ్డకు బయోలాజికల్ ఫాదర్ మెల్విన్ అవునా, కాదా అని తెలుసుకోవడానికి అతని ఎముకలు, దంతాల నమూనాలను సేకరించినట్లు అధికారులు చెప్పారు. పసి బిడ్డ వెంట్రుకలను, రక్తనం నమూనాలను కూడా సేకరించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+