దారుణం: తానిచ్చిన రూ. 60 అడిగినందుకు నిప్పంటించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తానిచ్చిన రూ. 60 ఎప్పుడు ఇస్తావంటూ అడగినందుకు ఓ వ్యక్తి అతడికి నిప్పంటించాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బల్కా అహివార్ అనే వ్యక్తి వద్ద హర్వీర్ అహివార్(33) రూ. 60 తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన రూ.60 తిరిగి తీసుకునేందుకు బల్కా.. ఆదివారం సాయంత్రం హర్వీర్ అహివార్ ఇంటికి వెళ్లాడు.

తానిచ్చిన రూ. 60లు తిరిగి ఇవ్వాలని హర్వీర్‌ను కోరాడు. ఇందుకు నిరాకరించిన హర్వీర్ తన ఇంట్లోని కిరోసిన్ కంటెయినర్‌లో కిరోసిన్ తీసుకొచ్చి బల్కా ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఇందుకు బన్సీ, రాజన్, సంగరమ్, రవీంద్ర, బబ్బూ అనే హర్వీర్ స్నేహితులు కూడా సహకరించారు.
గమనించిన చుట్టుపక్కల వారు బల్కాను ఆస్పత్రికి తరలించారు. 90శాతం గాయాలపాలైన బల్కా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications