తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేయలేదని భార్యను కాల్చాడు
పాట్నా: తనకు నచ్చిన/పార్టీకి ఓటు వేయలేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కాల్చిన సంఘటన బీహార్ రాష్ట్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బీహార్‌లోని ఉజియపూర్ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.
వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి సమస్తిపూర్ జిల్లాలోని మోహియుద్దీన్ నగర్ గ్రామంలో నివసిస్తున్నాడు. బుధవారం వారిద్దరి మధ్య ఓటు విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహం చెందిన అతను భార్యను కాల్చాడు.

బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్థానిక వైద్యులు చెప్పారు. ఆమెను పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
భార్యను కాల్చిన వినోద్ పాశ్వాన్ పైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను పరారీలో ఉన్నాడు. ఉజియపూర్ నియోజకవర్గంతో సహా బీహార్ రాష్ట్రంలోని ఏడు లోకసభ నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications