జేబులో డబ్బు లేదని నడి రోడ్డులో కాల్చేశారు
లక్నో: ఇంటికి వెళుతున్న వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని అడిగారు. అతని దగ్గర ఏమి లేదని తెలుసుకున్న దుండగులు నడి రోడ్డు మీద రివాల్వర్ తో కాల్చి చంపేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా శింగవలీ ప్రాంతంలో ఫరీదుద్దీన్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఉమరుద్దీన్ (8) అనే కుమారుడు ఉన్నాడు. రాత్రి ఫరీదుద్దీన్ కుమారుడిని పిలుచుకుని బయటకు వెళ్లాడు. తరువాత పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు.

మార్గం మధ్యలో నాలుగు బైక్ లలో వెళ్లిన దుండగులు ఫరీదుద్దీన్ ను అడ్డుకున్నారు. తరువాత నీ జేబులో ఉన్న నగదు, విలువైన వస్తులు ఇవ్వాలని రివాల్వర్ తో బెదిరించారు. తన దగ్గర ఏమి లేవని ఫరీదుద్దీన్ చెప్పాడు.
అంతే సహనం కొల్పోయిన నిందితులు రివాల్వర్ తో ఫరీదుద్దీన్ ను కాల్చి చంపి అక్కడి నుండి పరారైనాడు. 8 సంవత్సరాల బాలుడు తండ్రిని రక్షించుకోలేక కేకలు వేశాడు. అటు వైపు వెళుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం గాలిస్తున్నామని శనివారం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications