కాలేజ్ లో పీజీ విద్యార్థిని గొంతు కోశాడు
ఘాజియాబాద్: చిన్న విషయంలో గొడవపడి సహనం కొల్పోయిన యువకుడు పీజీ చదువుతున్న విద్యార్థిని గొంతు కోశాడు. తరువాత అతను విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. బాధితురాలికి వెంటనే శాస్ర్త చికిత్స చెయ్యడంతో ప్రాణాలతో బయటపడింది.
హత్య చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లోని శంబు దయాల్ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజ్ ఓ యువతి ఎంఏ సెకండియర్ చదవుతున్నది.
అదే కాలేజ్ లో ప్రశాంత్ అనే యువకుడు పీజీ చదువుతున్నాడు. గత కొంత కాలంగా ప్రశాంత్ ఆ యువతితో అన్యోన్యంగా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. మంగళవారం కాలేజ్ కు వెళ్లిన ప్రశాంత్ యువతి మీద కన్ను వేశాడు. యువతి ఒంటరిగా వెలుతున్న విషయం గుర్తించాడు.

వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కత్తి తీసుకుని గొంతు కోశాడు. తరువాత ప్రశాంత్ విషం సేవించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన సాటి విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రశాంత్ ను పట్టుకుని చితకబాదేశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో యువతికి శాస్ర్త చికిత్స చెయ్యడంతో ప్రాణాలతో భయటపడిందని పోలీసు అధికారులు అన్నారు. ప్రశాంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఘాజియాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications