ఉద్యోగం పేరుతో పార్క్‌కు.. యువతిపై అఘాయిత్యం... ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు....
ఉపాధి కల్పిస్తానని నమ్మబలికాడు. 21 ఏళ్ల యువతిని పార్క్‌లోకి తీసుకెళ్లాడు. ఓ మూలాన గల పచ్చికబయళ్లపై ఘాతుకానికి పాల్పడబోయాడు. అయితే యువతి అరవడం కూడా పాపమైపోయింది. దీంతో రంగప్రవేశం చేసిన ఇద్దరు.. యువతిని కాపాడారు. కానీ తమలోని నీచపుబుద్ధిని బయటపెట్టారు. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత స్నేహితులను పిలిచి అఘాయిత్యానికి ఒడిగట్టారు.

కూతవేటు దూరంలో..
దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో గల నోయిడా సెక్టార్ 63లో దారుణం జరిగింది. అయితే పోలీసుస్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే లైంగికదాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. అఘాయిత్యం తర్వాత యువతి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. జరిగిన ఘటనను వివరించడంతో వారు ఆస్పత్రికి తరలించారు.

ఉపాధి పేరుతో
నోయిడాకు చెందిన రవి.. ఎక్స్‌పర్ట్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తనకు తెలిసిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించాడు. ఆమె నిజమేననుకొని.. ఆశపడింది. రాత్రి ఆమెను తీసుకొని స్థానిక పార్క్‌కు వెళ్లాడు. అక్కడ కాసేపు మాటా మంతీ అయ్యాక.. తన వక్రబుద్ధిని చూపించాడు. యువతిపై లైంగికదాడికి పాల్పడబోయాడు. ఆమె అరవడంతో గుడ్డు, శ్యాం అనే నరరూప రాక్షసులు వచ్చారు. రవి బారి నుంచి యువతిని కాపాడారు. రవిని చితక్కొట్టి యువతిని రక్షించారు. కానీ వారు తమ వక్రబుద్దిని చూపించారు.

వక్రబుద్ధి..
తర్వాత యువతిని ఇంటికి తీసుకెళ్లాలి. లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ గుడ్డు, శ్యాం ఇవేమీ చేయలేదు. మహిళపై తమ నీచపు బుద్ధిని ప్రదర్శించారు. లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత తమ స్నేహితులను పిలిచారు. బ్రిజ్ కిశోర్, పితంబర్, ఉమేశ్‌ను కూడా యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు.

పీఎస్ వద్దకు..
పార్క్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండటంతో బాధితురాలి ఓపిక తెచ్చుకుని వెళ్లింది. జరిగిన ఘటనను చెప్పింది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. యువతి పరిస్తితి స్థిమితంగానే ఉందని.. కానీ తీవ్రగాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు.

నలుగురి అరెస్ట్..
బ్రిజ్ కిశోర్, పితంబర్, ఉమేశ్ కూరగాయాలు విక్రయిస్తుంటారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రవి, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో ఇద్దరి సమాచారం అందజేస్తే రూ.25 వేల రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications