Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుష్ప స్టైల్‌లో తగ్గేదేలేదన్నాడు.. పోలీసులు బెండు తీశారు: ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

ముంబై: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. పాన్ ఇండియా మూవీగా పేరు తెచ్చుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్మగ్లర్‌‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపిస్తోంది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలై ఇన్ని రోజులైనప్పటికీ.. కలెక్షన్లు తగ్గట్లేదు. అటు ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్‌పై కూడా దుమ్ము దులుపుతోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండకు ధీటుగా నిలిచిందీ మూవీ.

 పుష్పరాజ్ స్టైల్‌లో స్మగ్లింగ్..

పుష్పరాజ్ స్టైల్‌లో స్మగ్లింగ్..

ఎర్రచందనాన్ని ఏ రేంజ్‌లో అక్రమంగా రవాణా చేయవచ్చనేది ఈ సినిమాలో క్లియర్‌గా చూపించాడు దర్శకుడు సుకుమార్. పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బలగాలు, అటవీ సిబ్బంది, చెక్‌పోస్టులను దాటుకుని ఎన్ని రకాలుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయవచ్చో.. ఓ లెసన్‌గా తెరకెక్కించాడు. పుష్పరాజ్ క్యారెక్టర్.. కోట్ల రూపాయలను సంపాదించడానికి ఈ ఐడియాలే ప్రధాన కారణం. అవే ట్రిక్స్‌ను ఉపయోగించి పుష్పరాజ్ స్టైల్‌లో కోటీశ్వరుడు కావాలనుకున్నాడు ఓ ట్రక్ డ్రైవర్.. అది కాస్తా బెడిసి కొట్టింది. కటకటాలపాలయ్యాడు.

సాంగ్లీలో ఘటన..

సాంగ్లీలో ఘటన..

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆ ట్రక్ డ్రైవర్ పేరు యాసిన్ ఇనాయతుల్లా. బెంగళూరు నివాసి. తరచూ కూరగాయలను తీసుకుని మహారాష్ట్రకు వెళ్తుంటాడు. పుష్ప సినిమా చూసిన తరువాత ఎర్రచందనం దుంగలను తన ట్రక్‌లో స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. అచ్చంగా పుష్ప సినిమాలో చూపించిన విధంగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించాడు. పైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో నింపిన ట్రక్‌ కిందిభాగంలో దాదాపు వందకుపైగా ఎర్రచందనం దుంగలను పేర్చాడు.

కూరగాయల ట్రక్‌లో..

కూరగాయల ట్రక్‌లో..

కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను సేకరించాడు. ట్రక్కులో వాటిని నింపుకొని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులను దాటడానికి ప్రయత్నించాడు. మహారాష్ట్ర మిరాజ్ నగర్‌లోని గాంధీచౌక్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల చేతికి దొరికాడు. ట్రక్‌ను క్షుణ్నంగా తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. పైన ఆకుకూరలు, కూరగాయలను నింపిన ట్రక్ కింది భాగంలో భారీగా పేర్చిన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

 పక్కా సమాచారం అందడంతో..

పక్కా సమాచారం అందడంతో..

ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం తమకు అందిందని, అందుకే తనిఖీలను ముమ్మరం చేశామని సాంగ్లీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీక్షిత్ గెడెమ్ తెలిపారు. సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశామని, అటవీ సిబ్బంది సహకారాన్ని తీసుకున్నామని అన్నారు. టన్ను బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను యాసిన్ ఇనాయతుల్లా తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.

Recommended Video

    Allu Arjun Reacted David Warner's Hook Step From Pushpa | Oneindia Telugu
    రెండున్నర కోట్ల రూపాయలుగా..

    రెండున్నర కోట్ల రూపాయలుగా..

    వాటి విలువ 2.45 కోట్ల రూపాయలుగా నిర్ధారించామని అన్నారు. ఒక్కో దుంగ విలువ 10 లక్షల రూపాయలుగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. యాసిన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతణ్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ దీక్షిత వివరించారు. ఎర్రచందనం దుంగలను ఎలా స్మగ్లింగ్ చేయవచ్చనేే విషయం మీద అటవీ శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. వారు ఇచ్చిన చిట్కాలు పనికొచ్చాయని వ్యాఖ్యానించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+