విషాదం : కూతురు మృతదేహంతో 15 కిలోమీటర్లు నడిచిన తండ్రి, సిబ్బందిపై వేటు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తన కూతురు మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ఉచితంగా వాహనాన్ని సమకూర్చకపోవడంతో 15 కిలోమీటర్ల పాటు మృతదేహన్ని భుజాన వేసుకొని వెళ్ళాడు ఓ తండ్రి
ఓడిశా : అంత్యక్రియలకు డబ్బులు లేక చాలా దూరం నడక సాగించిన ఘటనలు ఇటీవల అనేకం చోటుచేసుకొంటున్నాయి.ఇలాంటి ఘటన మరోకటి ఒడిశా రాష్ట్రంలో మరోటి చోటుచేసుకొంది. గతంలో ఇదే రాష్ట్రంలో భార్య మృతదేహంతో వ్యక్తి నడిచిన ఘటన సంచలనం కల్గించింది.
ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా పల్లహరా సమీప గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. సుమీ ధిబర్ అనే ఐదేళ్ళ బాలిక జ్వరం వచ్చింది. అయితే ఆమెకు చికిత్స చేయించేందుకుగాను ఆమెను పల్లహరా హెల్త్ కమ్యూనిటీ సెంటర్ లో చేర్పించాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని భావించాడు తండ్రి. అయితే ఉచిత వాహనాన్ని సమకూర్చేందుకుగాను ఆసుపత్రి అధికారులు నిరాకరించారు.

దీంతో తండ్రి గటి ధిబర్ ఆమెను పల్లహరా హెల్త్ కమన్యూనిటీ సెంటర్ నుండి చిన్నారి మృతదేహన్ని భుజాన వేసుకొని కాలినడకన స్వగ్రామం చేరుకొన్నాడు. ఈ ఘటనపై స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ విషయం తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందిని విధుల నుండి తప్పించాడు. ఆసుపత్రికి వచ్చిన భాదితులకు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందారని ఆయన ఆరోపిస్తూ కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.












Click it and Unblock the Notifications