ex-army: మేకల పంచాయితీ పెట్టిన ఆర్మీ మాజీ ఉద్యోగి, తుపాకితో రచ్చరచ్చ !
చెన్నై/ తిరుచ్చి: భారతసైన్యంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని స్థానికులు ఎక్కువగా గౌరవించేవారు. చాలా సంవత్సరాలు భారత సైన్యంలో పని చేసిన అతను రిటైడ్ అయ్యి సొంత ఊరికి వచ్చాడు. సొంత ఊరికి చేరుకున్న తరువాత మాజీ సైనికుడికి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తున్న అతను అప్పుడప్పుడు సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. మాజీ సైనికుడు మేకల పంచాయితీ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని మనప్పరై ప్రాంతం సమీపంలోని ఒడియాపట్టి ప్రాంతంలో థామస్ జాన్ బ్రిటో అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొంతకాలం ఆర్మీలో ఉద్యోగం చేసిన జాన్ కొన్ని సంవత్సరాల క్రితం రిటైడ్ అయ్యాడు. ఆర్మీ నుంచి రిటైడ్ అయిన జాన్ అతని సొంత ఊరికి చేరుకున్నాడు. జాన్ కొంతకాలం అతని భార్య, పిల్లలతో కాలం గడిపాడు.

టీఎన్ పీఎల్ ప్లాంట్ లో సీనియర్ సెక్యూరిటీ గార్డుగా జాన్ ఉద్యోగంలో చేరాడు. అప్పుడప్పుడు జాన్ అతని సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో సొంత గ్రామంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి సుమారు వంద మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నాడు. గ్రామానికి వెళ్లిన జాన్ అతని బైక్ తో మేకలను ఢీకొన్నాడు. జాన్ బైక్ డీకొడంతో నాలుగు మేకలకు గాయాలైనాయి.
ఆ సందర్బంలో మేకల యజమాని రాజ్ కుమార్ తో జాన్ గొడవపెట్టుకున్నాడు. గ్రామస్తులు సర్దిచెప్పి ఇద్దరిని అక్కడి నుంచి పంపించారు. ఇంటికి వెళ్లిన రిటైడ్ ఆర్మీ ఉద్యోగి జాన్ తుపాకి తీసుకువచ్చి మేకల యజమాని రాజ్ కుమార్ ను చంపేస్తానని నానా హంగామా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. జాన్ హంగామాతో సహనం కోల్పోయిన మేకల యజమాని రాజ్ కుమార్ ఆర్మీ మాజీ ఉద్యోగి జాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications