రాహుల్‌కు బెదిరింపు లేఖ, ఆగంతకుడి అరెస్ట్, ఇదివరకు కూడా లేఖలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇదివరకు రాహుల్ గాంధీని ఓ వ్యక్తి బెదిరించిన సంగతి తెలిసిందే. ఇండోర్‌లో భారత్ జోడో యాత్ర చేపట్టొద్దు అని పేర్కొన్నారు. ఈ మేరకు లేఖ రాయడం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతనిని గుర్తించి.. అరెస్ట్ చేశారు.
ఉజ్జయినిలో గల నగ్దా వద్ద అతనిని అరెస్ట్ చేశారు. అతని పేరు దయా అలియాస్ ప్యారె, అలియాస్ నరేంద్ర సింగ్ అని పోలీసులు తెలిపారు. అతని బెదిరింపు లేఖతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 200 సీసీటీవీ ఫుటేజీ చూశారు. హోటళ్లపై రైడ్ చేశారు. లాడ్జీ, రైల్వే స్టేషన్ చెక్ చేశారు.

బెదిరించిన వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్‌లో గల రాయ్ బరేలి అని తేలింది. అంతకుముందు చాలా మందికి ఇలానే ఫోన్ చేసి బెదిరించాడని కూడా పోలీసులు తెలిపారు. ఖల్సాలో జరిగిన కార్యక్రమానికి నిందితుడు దయ హాజరయ్యారట. ఆ సమావేశానికి మద్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications