Bank manager: ఎవడిదో సొత్తు, ఎల్లమ్మ జాతర, బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడంటే, భార్య వెళ్లి చూస్తే?!
యానం/ కాకినాడ: ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో కొన్ని సంవత్సరాలు బ్యాంక్ మేనేజర్ చాలా సంతోషంగా జీవించాడు. ఇటీవల బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఒత్తిడికి గురైనాడు. బ్యాంక్ మేనేజర్ ఇంటికి వెళ్లాడు.
తరువాత రూమ్ లోకి వెళ్లిన తరువాత అతను బయటకురాలేదు. భార్య కిటికీలో చూడగా బ్యాంక్ మేనేజర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. బ్యాంక్ లో లోన్లు తీసుకున్న వాళ్ల దెబ్బతోనే బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మచిలిపట్నంలో బ్యాంక్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ లోని మచిలిపట్నంలో సాయిరత్న శ్రీకాంత్ అలియాస్ శ్రీకాంత్ (33) ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా ఉద్యోగం చేశాడు. గాయిత్రీ అనే యువతిని వివాహం చేసుకున్న బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గాయిత్రీ, పిల్లలతో కొన్ని సంవత్సరాలు బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ చాలా సంతోషంగా జీవించాడు.

యానంకు బదిలి
మచిలిపట్నం బ్రాంచ్ నుంచి బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ను మూడు సంవత్సరాల క్రితం యానం బ్రాంచ్ కు బదిలి చేశారు. యానం వెళ్లిన తరువాత శ్రీకాంత్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ప్రతిరోజు బ్యాంక్ కు వెళ్లి వస్తున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో చాలా ఒత్తిడికి గురై ఇంట్లో భార్య గాయిత్రీతో సహ పిల్లలతో సక్రమంగా మాట్లాడటం లేదని తెలిసింది.

ఉరి వేసుకుని ఆత్మహత్య
బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్లాడు. రూమ్ లోకి వెళ్లిన తరువాత శ్రీకాంత్ బయటకురాలేదు. తలుపు తియ్యాలని భార్య గాయిత్రీ ఎన్నిసార్లు తలుపులు కొట్టినా శ్రీకాంత్ మాత్రం మాట్లాడలేదు. గాయిత్రీ కిటికీలో చూడగా బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

ఎవడో చేసిన పనికి బ్యాంక్ మేనేజర్
శ్రీకాంత్ ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ లోని పై అధికారుల ఆదేశాల మేరకు చాలా మందికి లోన్లు మంజూరు చేశారు. లోన్లు తీసుకున్న వారు సరై సమయంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో శ్రీకాంత్ అప్పులు చేసి రూ. 60 లక్షల వరకు లోన్లు కట్టారు. తరువాత శ్రీకాంత్ ను యానంకు బదిలి చేశారు. అక్కడ కూడా పై అధికారుల ఆదేశాల మేరకు చాలా మందికి శ్రీకాంత్ అప్పులు ఇచ్చాడు.

యానంలో సేమ్ సీన్ రిపీట్
అక్కడ కూడా లోన్లు తీసుకున్న వాళ్లు చేతులు ఎత్తేయడంతో బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ యానం బ్రాంచ్ లో కూడా రూ. 30 లక్షలకు పైగా అప్పులు చేసి లోన్లు తీసుకున్న వారి పేరుతో రుణం చెల్లించాడని తెలిసింది. సుమారు రూ. 1 కోటి రూపాయల వరకు అప్పులు చేసి రుణం తీసుకున్న వారి పేరుతో ఈఎంఐలు కట్టిన శ్రీకాంత్ తీవ్ర ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications