వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనేం చేశానంటే..: రమ్య వీడియో సందేశం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శాండిల్ వుడ్ హీరోయిన్, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు.

గత ఉప ఎన్నికలలో మాండ్య నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన అనంతరం తాను నియోజకవర్గానికి ఏమేం చేశానో ఆ వీడియలో ఆమె చెప్పారు.

ఆరు నెలల తక్కువ కాలంలోనే మాండ్య నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని, మరోసారి తనకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

రమ్య

రమ్య

రమ్య అలియాస్ దివ్య స్పందన గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.

రమ్య

రమ్య

ఇప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికలలోను ఆమె అదే నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కాలంలో తాను నియోజకవర్గానికి ఏం చేశానో చెబుతూ వీడియోను విడుదల చేశారు.

రమ్య

రమ్య

కొన్ని రోజులుగా రమ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. సినిమాలను పక్కన పెట్టి మరీ ఆమె ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ఎక్కువగా దూసుకు పోతున్నారు.

రమ్య

రమ్య

రమ్య ఇంటింటికి వెళ్లి ఓటు అడిగారు. సామాజిక వెబ్ సైట్ల ద్వారా కూడా రమ్య ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో ఓ అడ్వర్టైజ్‌మెంట్ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు.

రమ్య

రమ్య

లోకసభలో ఇటీవలి పార్లమెంటు సభ్యురాలు రమ్య ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు ఆమె పైన ప్రశంసలు కురిపించారు.

రమ్య

రమ్య

కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం కేంద్రం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రమ్య తన వీడియోలో ప్రజలకు వివరించారు.

రమ్య

రమ్య

రమ్య తన వీడియోలో చేసిన, చేయబోయే పనులు ఏకరువు పెట్టారు. పాఠశాలల్లో పిల్లలకు షూ పంపిణీ చేసినట్లు చెప్పారు. గ్రామాలకు రోడ్లు, బస్సు షెల్టర్లు, ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బస్సు ఫెసిలిటీ కావాలన్నారు.

రమ్య

రమ్య

వికలాంగులకు, బలహీనులకు వీల్ చైర్లు తదితరాలు అంద చేసినట్లు చెప్పారు. ఓ గ్రామంలో హెల్త్ సెంటర్, అంబులెన్స్ ఏర్పాటు చేయించినట్లు చెప్పారు.

రమ్య

రమ్య

రైతుల సమస్యలపై తాను ప్రసంగానికే పరిమితం కానని రమ్య చెప్పారు. రైతు సమస్యల పైన తాను ప్రత్యేక దృష్టి పెడతానని దివ్య స్పందన అలియాస్ రమ్య చెప్పారు.

English summary

 Divya Spandana, known as Ramya as her screen name, is a popular actress in the Sandalwood films. She has elected as Member of Parliament from Mandya. here is a short video on Ramya's work done in Mandya in a short span of six months being an MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X