ఫారెస్ట్ స్టాఫ్‌పై చేయి చేసుకుని, తోసేసిన మేనకా గాంధీ
లక్నో: బిజెపి సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ పులుల అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులపై ఆమె చేయి చేసుకున్నట్లు, వారిని తోసిసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అటవీ శాఖ ఉద్యోగులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఆదివారంనాడు ఓ కార్యక్రమానికి పురాన్‌పూర్ వెళ్తుండగా దారిలో జంగిల్ ఫైర్‌ను చూసి మేనకా గాంధీ ఆగ్రహించారని, దానికితోడు తనను కొట్టడమే కాకుండా తనను తోసేశారని అటవీ శాఖ ఉద్యోగి రూప్‌లాల్ గజ్రౌలా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పొలాల్లో గోధుమ పంట అవశేషాలు కాలిపోతుండడాన్ని చూసి మాలా ఫారెస్టు రేంజ్‌లోని గర్ఙా ఫారెస్ట్ బారియర్ వద్ద మేనకా గాంధీ ఆగారని, దాంతో సంయమనం కోల్పోయి తనపై విరుచుకుపడ్డారని రూప్‌లాల్ తన ఫిర్యాదులో చెప్పారు.












Click it and Unblock the Notifications