19 ఏళ్ల బాలికపై ఆలయ పూజారి అత్యాచారం, అరెస్ట్

బెంగుళూరు: కర్ణాటకలోని మంగుళూరులో ప్రముఖ కతీల్ దుర్గాపరమేశ్వరి ఆలయంలో అసిస్టెంట్ పూజారిగా పనిచేస్తున్న హరిశ్చంద్రరావు (56)ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల బాలికపై ఆయన అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ అత్యాచార ఘటన ఏడాది క్రితం జరిగింది. దీంతో గర్భవతి అయిన బాధితురాలు ఇటీవలే అబార్షన్ కోసం స్థానికి ఆసుపత్రికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు వివరాల ప్రకారం 2015 ఆగస్టులో తన ఇంట్లో పనిచేస్తున్న బాలికపై హరిశ్చంద్రరావు అలియాస్ అప్పు భట్టా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Mangaluru temple priest rapes teenage girl, arrested

దీంతో బాలిక గర్భవతి అయింది. దీంతో పూజారి తనకున్న పలుకుబడితో స్థానిక నేతలతో పరిష్కారం జరిపించి బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగిన అత్యాచార సంఘటనను వెలుగులోకి రాకుండా చూశాడు.

గత నవంబర్‌లో బాధితురాలు అబార్షన్ కోసం స్థానికి ఆసుపత్రికి వెళ్లింది. అయితే బాలికకు అబార్షన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆసుపత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన హరిశ్చంద్రరావు బాలికకు అబార్షన్ చేయాలని సూచించాడు.

ఇందుకు అంగీకరించని ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధితురాలు మంగుళూరులోని బాజ్పే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హరిశ్చంద్రరావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+