మోడీపై శశిథరూర్ ప్రశంసలు: ’ఊసరవెల్లె‘నన్న అయ్యర్
న్యూఢిల్లీ: నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌పై మరో కాంగ్రెస్ సీనియర్ నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. థరూర్ ఒక పరిపక్వం చెందని నేత అని, ఊసరవెల్లి అని ఆరోపించారు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు తగదని శశిథరూర్‌కు ఆయన సూచించారు.
థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధకు గురిచేశాయని అయ్యర్ అన్నారు. థరూర్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ అపరిపక్వతే కారణమని ఆరోపించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలను తాము ఆమోదించడం లేదని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. ఎన్నికలకు ముందు మోడీని ‘చాయ్ వాలా' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కూడా మణిశంకర్ అయ్యర్ కావడం గమనార్హం. కాగా, ఇతర కాంగ్రెస్ నాయకులు మాత్రం శశిథరూర్ చేసిన వ్యాఖ్యల పట్ల భిన్నంగా స్పందించారు. థరూర్ తన అభిప్రాయాలను, భావాలను వ్యక్తీకరించారని తెలిపారు.

నరేంద్ర మోడీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధునిక అవతారం అభ్యుదయశీలంగా ఉందంటూ ప్రశంసించారు. అందరినీ కలుపుకుని పోయేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకపోవడం అమర్యాదకరమంటూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టినట్టు ఉండటం గమనార్హం.
హఫింగ్‌టన్ పోస్ట్ అనే అమెరికన్ వెబ్‌సైట్‌లో శశిథరూర్ మోడీకి సానుకూలంగా రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారని శశిథరూర్ సాఫ్టవేర్ భాషతో పోల్చుతూ ప్రశంసలు గుప్పించారు. మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ.. ఇప్పుడు రెందో దశలో ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా ఆదరిస్తుండడం, ప్రజలందరినీ కలుపుపోయేలా చర్యలు తీసుకుంటుండం ఆయనలోని మార్పుకు నిదర్శనమని శశిథరూర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications