లేడీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఆమె ఇంటి మీదకు ఐఈడీ బాంబులు, మేడమ్ జస్ట్ మిస్ !
మణిపూర్: మణిపూర్‌లోని నౌరియా పఖాంగ్ లక్పా అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే కెబీ దేవి నివాసంపై బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఐఈడీ బాంబులతో దాడి చేశారు. ఈ బాంబుల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు అంటున్నారు. హింసాత్మకమైన మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే కెబీ దేవి నివాసం మీద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఐఈడి బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే నివాసం గేటు పూర్తిగా ధ్వంసం అయ్యింది.
జూన్ 8వ తేదీ గురువారం అర్దరాత్రి బీజేపీ ఎమ్మెల్యేని దుండగులు టార్గెట్ చేశారు. ఇంఫాల్ వెస్ట్‌లోని నింగ్థెమ్చా కరోంగ్‌లో బీజేపీ ఎమ్మెల్యే కెబీ దేవి నివాసం ఉంటున్నారు. నౌరియా పఖాంగ్ లక్పా నియోజక వర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన కెబి దేవి నివాసంపై గుర్తు తెలియని దుండగులు బాంబు విసిరారని శుక్రవారం మణిపూర్ పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి బీజేపీ ఎమ్మెల్యే కెబీ దేవి నివాసం లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును విసిరారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు అంటున్నారు..

బాంబు విసిరిన తర్వాత బైక్‌పై వచ్చిన దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మణిపూర్ పోలీసులు తెలిపారు. అయితే పేలుడు జరిగినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కేబీ దేవి ఆమె నివాసంలో ఉన్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని, సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే ఇంటి బయట సీసీటీవీల్లో బీజేపీ ఎమ్మెల్యే కేబీ దేవి నివాసం ఉంటున్న ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దేవి ఇంటి మీద బాంబులు విసురుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు తమ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు శుక్రవారం తెలిపారు.
మణిపూర్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాకాండ అదుపులోకి వచ్చింది. గత 48 గంటల్లో ఎలాంటి హింసాకాండ జరగలేదని, రాష్ట్రంలో పరిస్థితి శాంతియుతంగా, అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ వెల్లడించారు. పోరంపట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 24 గంటల్లో 27 ఆయుధాలు, 245 బుల్లెట్లు, 41 బాంబులు స్వాధీనం చేసుకున్నామని మణిపూర్ పోలీసు అధికారులు శుక్రవారం తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications