బీజేపీకే ‘మణి’ హారం?.. ఇబోబీ మాజీ సహచరుడే బీరేన్‌సింగ్

మణిపూర్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రకటించుకున్నాయి. కానీ నార్త్ఈస్ట్ అలయెన్స్ (ఎన్ఈఏ) కన్వీనర్, బీజేపీ నేత - అ

ఇంఫాల్: మణిపూర్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రకటించుకున్నాయి. కానీ నార్త్ఈస్ట్ అలయెన్స్ (ఎన్ఈఏ) కన్వీనర్, బీజేపీ నేత - అసోం మంత్రి హిమంత బిశ్వా శర్మ తమకు 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ట్వీట్ చేశారు. 'మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలున్నాయి. @ బీజేపీకి 33 మంది ఎమ్మెల్యేలు మద్దతునిస్తున్నారు' అని పేర్కొన్నారు.

హిమంత బిశ్వాశర్మ అసోం పొరుగునే ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎవరెవరూ తమకు మద్దతునిస్తున్నారన్న సంగతి మాత్రం ఆయన బయట పెట్టలేదు. ఒకవైపు కీలకమైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు అందించిన ఉత్సాహంతో బీజేపీ దూసుకెళ్తుంటే మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో చేసిన జాప్యానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నది.

60 మంది ఎమ్మెల్యేలు గల మణిపూర్ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజారిటీ కావాలంటే 31 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని ప్రకటించిన బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించినట్లే. తద్వారా అసోం తర్వాత ఈశాన్య భారతంలో రెండో రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28 మంది, బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇబోబీసింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటును నిలువరించాలని భావిస్తున్న బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నది.

బీజేఎల్పీ నేతగా బీరేన్ సింగ్

బీజేఎల్పీ నేతగా బీరేన్ సింగ్

రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో గానీ, పార్లమెంట్‌లో గానీ అతిపెద్ద పార్టీని గానీ, కూటమిని గానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ 21 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ‘సై' అంటున్నది. సోమవారం వ్యూహాత్మకంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ మంత్రి బీరెన్‌సింగ్‌ను ఎన్నుకున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నజ్మా హెప్తుల్లా నిర్ణయం తీసుకుంటే మాత్రం బీరేన్ సింగ్ తదుపరి మణిపూర్ ముఖ్యమంత్రి కానున్నారు. అంతకుముందు బీజేపీ తమవైపు 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరింది. బీజేపీ ఈశాన్య రాష్ర్టాల ఇన్‌చార్జి రాంమాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వాశర్మ ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కలిసి 32 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని జాబితా అందించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)లకు చెందిన నలుగురేసి సభ్యులు, ఓ ఎల్‌జేపీ ఎమ్మెల్యే, ఒక తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే తమకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

బీజేపీ ఎత్తులతో ఇబోబీ షాక్

బీజేపీ ఎత్తులతో ఇబోబీ షాక్

బీజేపీ మ్యాజిక్‌ఫిగర్ 31 కంటే ఒక ఎమ్మెల్యే ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఒకవేళ ఆయనపై వేటుపడితే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 59కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 30కి పడిపోగా, బీజేపీ మద్దతుదారుల సంఖ్య 31గా ఉండటంతో అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఎక్కువగా ఉంటారు. ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిసిన ఇబోబి సింగ్ తమకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎన్‌పీపీ మద్దతు ఉన్నదని తెల్ల కాగితంపై రాసిన లేఖ అందజేయడంతో గవర్నర్ నజ్మా హెప్తుల్లా అందుకు నిరాకరించారు. ఎమ్మెల్యేలతోపాటు, ఎన్‌పీపీ అధ్యక్షుడిని తీసుకొని రావాలని సూచించినట్టు సమాచారం. ముందు సీఎం పదవికి రాజీనామా చేస్తేనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని, కాబట్టి రాజీనామా చేయాలని ఇబోబి సింగ్‌కు స్పష్టంచేసినట్టు తెలిసింది. బీజేపీ వేసిన ఎత్తుగడలతో 15 ఏళ్లుగా మణిపూర్ ఏలిన సీఎం ఇబోబీసింగ్ షాక్‌కు గురయ్యారు. తొలుత సీఎం పదవికి రాజీనామా చేయనన్న ఇబోబిసింగ్ ఎట్టకేలకు మంగళవారం తప్పుకుంటానని ప్రకటించారు.

మణిపూర్ తదుపరి సీఎంగా మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు?

మణిపూర్ తదుపరి సీఎంగా మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు?

బీజేఎల్పీ నేతగా ఎన్నికైన ఎన్ బీరేన్ సింగ్ ఒకనాటి ఇబోబిసింగ్ సహచరుడే. గతంలో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా భారత జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించిన బీరేన్ సింగ్.. తర్వాత రాజకీయాల్లో చేరారు. 2002లో హెయింగాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి డెమొక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనా తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2003లో సహాయమంత్రి పదవి చేపట్టిన బీరేన్ సింగ్ 2007, 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందినా సీఎం ఇబోబీసింగ్‌తో విబేధాల వల్ల గతేడాది అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హెయింగాంగ్ స్థానం నుంచి విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+