మరో దారుణం, ఇద్దరు మహిళలపై అత్యాచారం: అమానవీయంగా..!!
మణిపూర్ లో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన రోజే మరో ఇద్దరు మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అత్యాచారం తరువాత దుండగులు వారి పై దాడి చేయటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ మరణించారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలో మీటర్ల దూరంలో అదే రోజున (మే 4)న ఈ సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
మరో దుర్ఘటన: మే 4న ఇద్దరు మహిళలను మణిపూర్ లో నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కదలించింది. ఈ ఘోరాన్ని ప్రతీ ఒక్కరిలోనూ ఆగ్రహానికి కారణమైంది. ఇది సిగ్గుమాలిన చర్యగా ప్రధాని సహా ప్రతీ ఒక్కరూ నిరసించారు. అదే రోజున చోటు చేసుకున్న మరో దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంగ్ పోక్ఫీ ప్రాంతంలో ఇద్దరు యువతులు కార్ల సర్వీసు కేంద్రంలో పని చేస్తున్నారు.

వారు పనిలో ఉండగా కొందరు వ్యక్తులు వారి పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వారిని బయటకు లాడి పడేసారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వారి స్నేహితులు వెల్లడించారు.
ఇద్దరూ కన్నుమూత: బాధితులు 21,24 ఏళ్ల వయసు వారిగా తెలుస్తోంది. మహిళల దాడి చేసిన దుండగుల్లో మహిళలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారంతా మహిళలను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం యేయాలని ప్రోత్సహించారని వెల్లడించారు. దీంతో గదిలోకి వారిని ఈడ్చుకెళ్లి..లైట్లను ఆర్పి వేసి మహిళలు అరవకుండా నోట్లో వారి దుస్తులకు కుక్కినట్లు వివరించారు.
సుమారు గంటన్నార పాటు ఈ దారుణం కొనసాగిందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత బాధితులను ఈడ్చుకుంటూ తెచ్చి సమీపంలోని కట్టెల మిల్లులో పడేసారని చెప్పారు. వారి దుస్తులను చించేశారు. జుత్తును కత్తిరించారు. వారి శరీరాలు రక్తమోడుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. వారి డెడ్ బాడీలు ఇప్పటి వరకు దొరకలేదు.
మళ్లీ ఉద్రిక్తతలు: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇందులో ఒక బాలుడు ఉన్నాడు. మరో వ్యక్తికి 19 ఏళ్లు. గతంలో అరెస్ట్ చేసిన నలుగురికి 11 రోజుల రిమాండ్ విధించారు. ఇటు, ఇంఫాల్ లో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసకున్నాయి. మహిళలు రోడ్డుపై బైఠాయించారు.
టైర్లను తగల బెట్టారు. మహిళల పట్ల అమానీవీయంగా వ్యవహరించిన దుంగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు పరిస్థితిని చక్కదిద్దాయి. మణిపూర్ లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనల పైన దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications