కేంద్రం వర్సెస్ కేజ్రీ సర్కార్; అది ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదిక కాదు, బీజేపీ నివేదిక :మనీష్ సిసోడియా ఫైర్

ఆక్సిజన్ సంక్షోభం వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి నాలుగు రెట్లు అధికంగా ఆక్సిజన్ కోరిందని ఆడిట్ నివేదికలో వెల్లడైందని సుప్రీం ప్యానెల్ పేర్కొనడంపై ఢిల్లీ ప్రభుత్వం మండిపడుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఆరోపించిన నివేదిక ఉనికిలో లేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎదురు దాడి చేశారు.

 ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదిక లేదని ఫైర్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదిక లేదని ఫైర్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఇటీవలి నివేదికల ప్రకారం, కరోనా సెకండ్ వేవ్ లో గత నెలలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్‌ను కోరిందని తేల్చింది. ఇదంతా అబద్ధం అని మనీష్ సిసోడియా నివేదిక యొక్క ఫలితాలను ఖండించారు .అలాగే భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీ ప్రధాన కార్యాలయంలో నివేదిక తయారు చేశారని ఆయన ఆరోపించారు. అసలు ఇప్పటి వరకూ ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఇచ్చిన ఎలాంటి నివేదిక లేదని పేర్కొన్న మనీష్ సిసోడియా బిజెపి అబద్ధం చెబుతోందని తెలిపారు.

 ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఏ నివేదిక ఇవ్వలేదన్న మనీష్ సిసోడియా

ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఏ నివేదిక ఇవ్వలేదన్న మనీష్ సిసోడియా

తాము ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యులతో మాట్లాడామని, వారు ఎలాంటి నివేదికపై సంతకం చేయలేదని, ఆమోదించలేదని చెప్పారని వర్చువల్ విలేకరుల సమావేశంలో మనీష్ సిసోడియా చెప్పారు.ఆడిట్ కమిటీ సభ్యులు ఎటువంటి నివేదికపై సంతకం చేయనప్పుడు, వారు నివేదికను ఆమోదించనప్పుడు, అప్పుడు ఈ నివేదిక ఎక్కడ నుండి వచ్చింది? ఈ నివేదిక ఎక్కడ ఉంది? అని మనీష్ సిసోడియా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సంతకం చేసిన నివేదికను బహిర్గతం చేయాలని మనీష్ సిసోడియా బిజెపిని సవాలు చేశారు.

ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యుల సంతకాలు ఉన్న నివేదికను బహిర్గతం చెయ్యాలని సవాల్

ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యుల సంతకాలు ఉన్న నివేదికను బహిర్గతం చెయ్యాలని సవాల్

బిజెపి తన పార్టీ ప్రధాన కార్యాలయంలో తయారుచేసిన తప్పుడు నివేదికను ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యుల సంతకాలు ఉన్న నివేదికను సమర్పించాలని నేను వారిని సవాలు చేస్తున్నానని మనీష్ సిసోడియా అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో వాస్తవానికి ఆక్సిజన్ కొరత ఉందని మనీష్ సిసోడియా పునరుద్ఘాటించారు . ఆ సమయంలో కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించడంలో విఫలం కావడానికి కేంద్రమే కారణమని మనీష్ సిసోడియా ఆరోపణలు గుప్పించారు.

బీజేపీ కార్యాలయంలో తయారు చేసిన నివేదిక అంటూ ఆగ్రహం

బీజేపీ కార్యాలయంలో తయారు చేసిన నివేదిక అంటూ ఆగ్రహం

బిజెపి కార్యాలయంలో తయారుచేసిన ఆడిట్ నివేదికను, ఆక్సిజన్ ఆడిట్ నివేదిక అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణల ద్వారా బిజెపి నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏమీ చేయలేరని కానీ కేంద్రాలు ఆక్సిజన్ సరఫరాను తప్పుగా నిర్వహించడం వల్ల మహమ్మారి సమయంలో ఎంతో మంది ప్రజలు తమ వారిని కోల్పోయారని మనీష్ సిసోడియా మండిపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా బాధితుల ఆర్త నాదాలు కేంద్రానికి వినిపించలేదా అని ప్రశ్నించారు.

బీజేపీ నాయకుల అబద్దాలకు ఇది పరాకాష్ట

బీజేపీ నాయకుల అబద్దాలకు ఇది పరాకాష్ట

ఢిల్లీ వాసులు ఆక్సిజన్ కోసం అల్లాడి పోయారా లేదా? అని ప్రశ్నించారు.కొరత ఉందని చెప్పినప్పుడు వైద్యులు పడుకున్నారా? ఆసుపత్రులు అబద్ధమా? వారంతా కోర్టుకు వెళ్లారు, వారంతా అబద్ధాలు చెప్పారా? అని సిసోడియా ప్రశ్నించారు. అసలు నిజం ఏమిటంటే బిజెపి మరియు దాని అగ్రనాయకులు అబద్ధాలు చెబుతున్నారని, ఢిల్లీలో వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కొరతతో ఢిల్లీ తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై ఎదురు దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+