మంజు వారియర్ ఫిర్యాదుతో ప్రముఖ దర్శకుడు సనల్ కుమార్ అరెస్ట్: బ్లాక్‌మెయలింగ్, వేధింపులు
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ నటి మంజు వారియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేరళలోని నెయ్యట్టింకర వద్ద సనల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు చేస్తున్నాడని మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

మంజు వారియర్ ఫిర్యాదు సనల్ కుమార్ అరెస్ట్
మంజు వారియర్ ఫిర్యాదు మేరకు కొచ్చిలోని ఎలమక్కర పోలీస్ స్టేషన్‌లో సనల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, తన అరెస్టుకు ముందు సనల్ కుమార్ ఫేస్‌బుక్ లైవ్‌లోకి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం విపత్కర పరిస్థితుల్లో ఉందని, తనను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సనల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కస్టడీకి తీసుకుని కొచ్చికి తరలించారు. సెక్సీ దుర్గా చిత్రాన్ని రూపొందించిన ఈ దర్శకుడ్ని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించిన పోలీసులు.. అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని విషయం వెల్లడించలేదు.

మంజు వారియర్‌పై సనల్ కుమార్ ఎఫ్‌బీలో పోస్టులు
శశిధరన్ దర్శకత్వంలో మంజు వారియర్ నటించిన 'కాయట్టం' అనే సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం జరగడం గమనార్హం. నటి మంజు వారియర్ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, ఆమెకు ప్రమాదం ఉందంటూ పలు పోస్టులు చేశారు సనల్ కుమార్. అంతేగాక, ఆమె మేనేజర్లు బినీష్ చంద్రన్, బీనూ నాయర్‌పైనా తీవ్ర ఆరోపణలు చేశారు.

సనల్ కుమార్ పోస్టులపై స్పందించని నటి, మేనేజర్లు
కాగా, మంజు వారియర్ కేసు నుంచి ఇటీవల కేరళలో చోటు చేసుకుంటున్న ట్రాన్స్‌జెండర్ల హత్యల వరకు పలు విషయాలను ప్రస్తావిస్తూ భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు చెబుతూ.. ఆ లేఖలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు సనల్ కుమార్. అయితే, ఈ పోస్టులపై నటి కానీ లేదా ఆమె మేనేజర్లు కానీ స్పందించలేదు. సనల్ కుమార్‌పై మంజు వారియర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications