రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ డార్లింగ్: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని, ఆ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ కాంగ్రెస్ పార్టీ డార్లింగ్ అన్నారు. 'రాహుల్ కాంగ్రెస్ డార్లింగ్. పార్టీ సంప్రదాయాలను ఆయన నిబద్ధతతో ఆచరిస్తార'ని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రాహుల్ వెంట పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఘన వారసత్వాన్ని, ఒరవడిని రాహుల్ ముందుకు తీసుకు వెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు పలువురు నేతలు సోషల్ మీడియాలో అబినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications