Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సరిహద్దుల్లో చైనా తిష్ఠ వేసింది- బీజేపీది బ్రిటీష్ విభజనవాదం : పంజాబ్ లో మన్మోహన్..!!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ పైన ఫైర్ అయ్యారు. పంజాబ్ ఎన్నికల నేపథంలో ఆయన బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ తన తప్పులను సరి చేసుకుకోండా... ప్రజా సమస్యలకు నెహ్రూ ను బాధ్యులను చేయటం ఏంటని ప్రశ్నించారు. అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. బీజేపీ జాతీయవాదం బ్రిటీష్ విభజన వాదం పునాదులుగా ఏర్పడిందని మన్మోహన్ విమర్శించారు. విదేశాంగ విధానం మొదలు అన్ని రంగాల్లోనూ కేంద్రం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల నిరసనలు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఏడాది కాలంగా చైనా సరిహద్దుల్లో..

ఏడాది కాలంగా చైనా సరిహద్దుల్లో..


పంజాబీ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడాది కాలంగా చైనా సైన్యం మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటోదని..కానీ, ప్రభుత్వ చర్యలు దీనిని కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తోందని మన్మోహన్ ఆరోపించారు. విదేశాంగ విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్ అయ్యారు. పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు క్షీణిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించకుండా దేశ ప్రప్రథమ ప్రధాని జవహార్​లాల్ నెహ్రూపై బాధ్యత నెట్టివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

భద్రతా లోపం అనేది డామేజ్ చేయటానికే

భద్రతా లోపం అనేది డామేజ్ చేయటానికే

పంజాబ్ ప్రభుత్వాన్ని డామేజ్ చేసేందుకే ప్రధాని మోదీ తన పర్యటనలో భద్రతా లోపం ఉందంటూ చెప్పారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ రాజ్యాంగంపై విశ్వాసం లేదని..అన్ని వ్యవస్థలను బలహీనపరుస్తోందని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల..నిరుద్యోగం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. రైతుల ఆందోళన సమయంలో పంజాబీలను అవమానించే తీరున వ్యవహరించారంటూ మన్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పంజాబీలు ధైర్యం.. దేశ భక్తిని ప్రపంచం మొత్తం అభినందిస్తుందని..మోదీ ప్రభుత్వం మాత్రం మాట్లాడదని వ్యాఖ్యానించారు.

భారతీయుల గౌరవాన్ని పెంచేలా చేసాం

భారతీయుల గౌరవాన్ని పెంచేలా చేసాం


భారతీయుడిగా తనను ఇవన్నీ బాధిస్తున్నాయని చెప్పారు. పంజాబ్ అభివృద్ధి, వ్యవసాయం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ తన ప్రయోజనాల కోసం దేశాన్ని విభజిస్తున్నారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేసారు. తమ హయాంలో నిజాలను ఎన్నడూ దాచలేదని చెప్పారు. కాంగ్రెస్ - యూపీఏ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం, భారతీయుల గౌరవాన్ని పెంచామని చెప్పారు. తమ హయాంలో జరిగిన మంచిని గుర్తుంచుకోవాలని మన్మోహన్ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+