వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాబోయేది మరింత గడ్డు కాలమే.. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: మన్మోహన్

పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఉపద్రవాన్ని మోడీ అంచనా వేయలేకపోతున్నారని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్ తాజాగా మరోసారి దానిపై స్పందించారు.

Manmohan Singh slams Modi govt over demonetisation, says the worst is yet to come

బుధవారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతోన్న మాటను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. నోట్ల రద్దుతో గత నవంబర్ లో దేశ జీడీపీ 2పాయింట్స్ నష్టపోయినట్టుగా పేర్కొన్నారు.

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఇబ్బందులకు లోనైందని తెలిపారు.మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

English summary
India’s economy has gone from bad to worse following the government’s recall of high-value currency but the worst is yet to come, former prime minister Manmohan Singh said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X