ఉపయోగించమని ఎందుకు చెప్పాలి: అణ్వస్త్రాలపై మనోహర్ పారికర్ సంచలనం
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నప్పటికీ వాటిని తొలుత మనమే ఎవరి పైన ఉపయోగించమని ఇన్నాళ్లు స్వీయ నియంత్రణ పాటిస్తున్నామని, కానీ అసలు అలా ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలని వ్యాఖ్యానించారు.
ఓ వైపు భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అణ్వాయుధాలను తొలుత ఉపయోగించం అనే విధానానికి భారత్ కట్టుబడి ఉండాల్సిన అవసరమేముందని వ్యాఖ్యానించారు.
అణ్వాయుధాలను బాధ్యతారాహిత్యంగా ఉపయోగించబోమని ఎందుకు అనవద్దన్నారు. గురువారం ఆయన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అణ్వాయుధాలను తొలుత ఉపయోగించబోమని ఎందుకు కట్టుబడి ఉండాలని ప్రశ్నించారు.

బాధ్యతాయుతమైన అణుశక్తి మాది అని, బాధ్యతారాహిత్యంగా ఆ శక్తిని ఉపయోగించమని చెప్పాలన్నారు. ఆ తర్వాత దానిపై.. ఇది కేవలం తన వ్యక్తిగత ఆలోచన మాత్రమే అన్నారు. ఊహించని రీతిలో యుద్ధ వ్యూహం ఉండాలన్నారు. అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్న రీతిలో పాకిస్థాన్ రక్షణ మంత్రి మెరుపుదాడులకు ముందు భారత్‌ను హెచ్చరిస్తుండేవారని ఆయన గుర్తు చేశారు.
మెరుపుదాడుల అనంతరం ఎటువంటి హెచ్చరికలు లేవన్నారు. భారత్ అనూహ్యంగా ఏదైనా చేయవచ్చని వారు భావించడమే ఇందుకు కారణమన్నారు. భారత్ అణ్వాయుధ విధానంపై పునరాలోచించబోతోందని దీనర్థమా అని ఓ విలేకరి ప్రశ్నించగా కాదని చెప్పారు. ప్రభుత్వంలో విధానమేమీ మారలేదన్నారు.












Click it and Unblock the Notifications