వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా పారికర్ ప్రమాణం, కేబినెట్లో ఇతరులే ఎక్కువ: ఎల్లుండి పరీక్ష

మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కొంకణి భాషలో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఎనిమిది మంది మంత్రులతో గవర్నర్ మృతుల సిన్హా ప్రమాణం చేయించారు.

|
Google Oneindia TeluguNews

పనాజీ: మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కొంకణి భాషలో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఎనిమిది మంది మంత్రులతో గవర్నర్ మృతుల సిన్హా ప్రమాణం చేయించారు. 8 మందిలో ఆరుగురు ఇతరులే. ఇద్దరే బీజేపీ నుంచి మంత్రులు.

ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. మనోహర్ పారికర్ ఎల్లుండి (గురువారం) సభలో బలం నిరూపించుకోవాల్సి ఉంది.

Manohar Parrikar

చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎంజీపీకి చెందిన దవళికర్‌కు మంత్రి పదవి ఇచ్చారు. జీఎఫ్‌పికి చెందిన విజయ్ సర్దేశాయ్‌ని కేబినెట్లోకి తీసుకున్నారు. మాజీ డిప్యూటీ ఫ్రాన్సిస్‌కు కేబినెట్ బెర్త్ దక్కింది.

కాగా, బీజేపీ గోవా, మణిపూర్‌లలో ధన బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. దీనిపై బీజేపీ నేతలు కూడా ధీటుగా స్పందించారు. వారికి బలం ఉంటే గవర్నర్‌ను ఎందుకు కలవలేదని బీజేపీ ప్రశ్నించింది.

English summary
BJP leader Manohar Parrikar has been sworn-in as chief minister. He took the oath of office in Konkani. The Supreme Court has given Parrikar 48 hours to prove his majority on the floor of the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X