అప్పుడే ‘ఆ’ సినిమా చూశాం, గుండె ఆగినంతపని.. తల్లికి తెలిసేలోపే ఇలా: పారికర్ షాకింగ్

Subscribe to Oneindia Telugu

పనాజీ: గోవా ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్‌ పారికర్‌ తను యుక్త వయస్సులో చేసిన చిలిపి పనులను విద్యార్థులతో పంచుకున్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు 'పెద్దల' సినిమాలను చూశానని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పనాజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.

పెద్దల సినిమా చూశాం కానీ..

పెద్దల సినిమా చూశాం కానీ..

ఈ క్రమంలో యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. ‘మేం మామూలు సినిమాలనే కాదు.. ఆ వయస్సులో ‘పెద్దల' సినిమాలను కూడా చూసేవాళ్లం. మేం అప్పుడు ఆ సినిమాల్లో చూసినవాటికంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని టీవీల్లో ఎక్కువ చూస్తున్నారు' అని పారికర్ వెల్లడించారు.

గుండె ఆగినంత పని..

గుండె ఆగినంత పని..

‘అప్పుడు నేను, నా సోదరుడు అవధూత్‌తో కలిసి ఓ పెద్దల సినిమాకు వెళ్లాను. విశ్రాంతి సమయంలో లైట్స్‌ వేయగానే మా పక్కింటి వ్యక్తి ఒకరు మా పక్కనే కూర్చున్నట్లు గమనించాను. అతను ప్రతిరోజు మా అమ్మతో మాట్లాడతాడు. దీంతో నా గుండె ఆగినంత పని అయింది' అని మనోహర్ పారికర్ చెప్పారు.

అమ్మకు చెప్పిందిలా..

అమ్మకు చెప్పిందిలా..

కాగా, ‘ఆ వెంటనే నేను, మా సోదరుడు ఆ సినిమా హాల్‌ నుంచి బయటకి వచ్చాం. అప్పటికే అతను మమ్మల్ని చూసేశాడు. అయితే అమ్మ వద్ద తిట్లు తినకుండా తప్పించుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించాం. వెంటనే అమ్మ వద్దకు వెళ్లి ఓ సినిమాకు వెళ్లినట్లు చెప్పాం. అయితే ఆ సినిమా అభ్యంతరకమైన సినిమా అని మొదట తెలియదని.. దీంతో సినిమా మధ్యలోనే బయటకు వచ్చినట్లు చెప్పాం. దీంతోపాటు ఆ సినిమా చూడటానికి మన పక్కింటి వ్యక్తి కూడా వచ్చినట్లు జోడించాం' అని పారికర్ వివరించారు.

అతని తిక్కకుదిరిందిలా..

అతని తిక్కకుదిరిందిలా..

‘ఆ మరుసటి రోజు.. మేం అనుకున్నట్లే.. పక్కింటి వ్యక్తి వచ్చి మాపై మా అమ్మకు ఫిర్యాదు చేశాడు. దీంతో మా పిల్లలు సినిమాకు వెళ్లినట్లు నాకు తెలుసు. కానీ నీవెందుకు అలాంటి సినిమాకు వెళ్లావు? అని నిలదీసింది. దీంతో అతను వెంటనే బిక్కమొహం వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు' అంటూ ఆరోజుల్లో జరిగిన సరదా ఘటన గురించి గోవా సీఎం పారికర్ విద్యార్థులతో పంచుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goa Chief Minister Manohar Parrikar on Tuesday shared at a Childrens Day function here his experience of watching an "adult movie" in his youth. Parrikar was interacting with school students when one of them asked what kind of movies the former defence minister watched during his younger days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి